YSRCP: సీఎం జగన్ ‘మేమంతా సిద్దం’ బస్సుయాత్ర సక్సెస్.. కడప నుంచి శ్రీకాకుళం వరకు ఎలా సాగిందంటే..

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ షెడ్యూల్ ప్రకారం బుధవారం జరిగిన సభతో మేమంతా సిద్దం బస్సుయాత్ర ముగిసింది. సిక్కోలు సింహాల్లా సభకు భారీ ఎత్తున తరలివచ్చారు ప్రజలు. పెత్తందారుల ముఠాపై యుద్ధానికి సిద్ధం అంటూ సీఎం జగన్ కార్యకర్తల్లో జోష్ నింపారు. డబుల్‌ సెంచరీ కొట్టేందుకు సిద్ధమా అని ప్రజలను అడిగారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు ఆయన.

YSRCP: సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. కడప నుంచి శ్రీకాకుళం వరకు ఎలా సాగిందంటే..
Cm Ys Jagan
Follow us

|

Updated on: Apr 24, 2024 | 7:18 PM

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ షెడ్యూల్ ప్రకారం బుధవారం జరిగిన సభతో మేమంతా సిద్దం బస్సుయాత్ర ముగిసింది. సిక్కోలు సింహాల్లా సభకు భారీ ఎత్తున తరలివచ్చారు ప్రజలు. పెత్తందారుల ముఠాపై యుద్ధానికి సిద్ధం అంటూ సీఎం జగన్ కార్యకర్తల్లో జోష్ నింపారు. డబుల్‌ సెంచరీ కొట్టేందుకు సిద్ధమా అని ప్రజలను అడిగారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు ఆయన. తనకు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ బంద్‌ అవ్వడమే కాకుండా.. మళ్లీ ప్రజలను మోసం చేస్తారు.. జాగ్రత్త అని సూచించారు సీఎం జగన్. చంద్రబాబు మోసాలకు చెంపచెళ్లుమనేలా ఓటుతో సమాధానం చెప్పాలని కోరారు. జతకట్టిన జెండాలకు సరైన సమాధానం చెప్పాలన్నారు. పేద ప్రజల గుండెచప్పుడే ఈ సిద్ధం సభ అని పేర్కొన్నారు. 58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని తన సంక్షేమ పాలన గురించి వివరించారు. వైద్యారోగ్య రంగంలో ప్రతిష్ఠాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు సీఎం జగన్. తనపై యుద్ధం చేయడానికి చంద్రబాబు.. మరో మూడు పార్టీలతో పొత్తుపెట్టుకున్నారని ప్రజలకు వివరించారు. పరోక్షంగా కొన్ని పార్టీలతో పొత్తులో కొనసాగుతున్నట్లు చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మంచి పని చెప్పగలరా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో జగన్‌ మార్క్‌ కనిపిస్తోందని చెప్పారు. నాకు పేదలపై ఉన్న ప్రేమ ఏ నాయకుడికి లేదన్నారు.

బస్సుయాత్ర విజువల్స్..

ఇవి కూడా చదవండి

జగన్ స్పీచ్ హైలైట్స్ ఇవే..

సిద్ధం.. ఎన్నికల కోసం పుట్టుకొచ్చిన పదం కాదని తన ప్రతీ పథకం.. ప్రజల భవితను మార్చేందుకు సిద్ధమని చెప్పారు. 18రోజుల్లో జరిగే యుద్ధానికి ముందే చేపట్టిన జైత్రయాత్ర ఈ సిద్ధం అని పేర్కొన్నారు. అబద్ధాలు, మోసాల్లో నేను చంద్రబాబుతో పోటీపడలేనన్నారు. మోసాన్ని మోసంతో జయించాలన్న సిద్ధాంతం తనకు లేదని ప్రజలకు వివరించారు. నీతి, నిజాయితీతో పనిచేశాను, అందుకే తిరిగి మళ్లీ ఓట్లు అడుగుతున్నానన్నారు. మీకు మోసాల చంద్రబాబు కావాలా.. నిజాయితీ ఉన్న జగన్ కావాలా? అని సభకు హాజరైన ప్రజలను అడిగారు. చేయలేని, సాధ్యంకాని హామీలు మేనిఫెస్టోలో తాను పెట్టనని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పానంటే.. చేస్తానంతే అని ప్రజలకు వివరించారు. పెత్తందారుల ముఠాపై యుద్ధానికి సిద్ధమా అని అడిగారు. డబుల్‌ సెంచరీ కొట్టేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఒకట్రెండు రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు. చేతగాని, చెయ్యలేని హామీలు ఇవ్వనన్న జగన్.. మేనిఫెస్టో అంటే ఖురాన్, బైబిల్, గీతతో సమానమన్నారు.

సభలో ర్యాంప్ వాక్ దృశ్యాలు..

బస్సుయాత్ర ఇలా..

కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మేమంతా సిద్దం బస్సుయాత్ర శ్రీకాకుళం టెక్కలిలో ముగిసింది. 22 రోజుల పాటు సాగిన సీఎం జగన్మోహన్‌రెడ్డి బస్సుయాత్ర 86 నియోజకవర్గాల మీదుగా సాగింది. 6 ప్రత్యేక ముఖాముఖి సమావేశాలు, 9 భారీ రోడ్‌షోలు, 16 బహిరంగసభల్లో పాల్గొన్నారు సీఎం జగన్‌. ప్రతి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభల్లో అభ్యర్ధులను పరిచయం చేస్తూ ఆసక్తిగా యాత్ర సాగింది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రవరకూ అడుగడుగునా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగారు సీఎం జగన్. దారి పొడవునా లక్షలాది మంది జనం సీఎం జగన్‎కు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఎక్కడిక్కడ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగారు. 200 మందికి పైగా ఇతర పార్టీల నేతల చేరికలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్‌ నింపారు. పార్టీలో నేతల మధ్య సమన్వయం చేస్తూ.. అందరూ కలిసి పనిచేసేలా సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే యాత్ర మధ్యలో ఎడమ కన్నుపై రాయితో దాడి జరిగి ఒకరోజు విరామం తీసుకున్నారు. విరామం తరువాత తిరిగి వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ఉభయగోదావరి జిల్లాల మీదుగా కొనసాగిస్తూ.. ఉత్తరాంధ్ర జిల్లాలకు చేరుకున్నారు. బుధవారం శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో విజయవంతంగా మేమంతా సిద్దం బస్సుయాత్రను ముగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..