మోదీ ధనవంతుల ‘చౌకీదార్’‌- రాహుల్‌ గాంధీ

మోదీ ధనవంతుల ‘చౌకీదార్’‌- రాహుల్‌ గాంధీ

పాట్నా: ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ స్పీడు పెంచారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లోని పూర్ణియాలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆనంతరం రాహుల్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాపలాదారుడుగా ఉంటున్నది పేదవారికి కాదని, ధనవంతులకేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో మోదీ చాలా హామీలు ఇచ్చారు కానీ, వాటిల్లో ఏవీ అమలైన వాటి జాబితా తీస్తే ప్రభుత్వ పనితీరు తెలిసిపోతుందన్నారు. […]

Ram Naramaneni

|

Mar 23, 2019 | 4:17 PM

పాట్నా: ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ స్పీడు పెంచారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లోని పూర్ణియాలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆనంతరం రాహుల్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాపలాదారుడుగా ఉంటున్నది పేదవారికి కాదని, ధనవంతులకేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో మోదీ చాలా హామీలు ఇచ్చారు కానీ, వాటిల్లో ఏవీ అమలైన వాటి జాబితా తీస్తే ప్రభుత్వ పనితీరు తెలిసిపోతుందన్నారు. తాము అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌, ఛత్తీసగఢ్‌లో రైతు రుణమాఫీ చేస్తామన్న హామీ నెరవేర్చుకనున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్పోరేట్ల సేవలో తరిస్తుందని…వారికి రైతుల కన్నీళ్లు పట్టవని రాహుల్ ఎద్దేవా చేశారు.

అనిల్ అంబానీ, నీరవ్ మోదీ లాంటి కార్పోరేట్లకు మోదీ చౌకీదార్‌గా పనిచేస్తున్నారని… దేశాన్ని సంపన్నుల వర్గం, పేదవారి వర్గంగా విడగొట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. సాధారణ ప్రజలను మోదీ మిత్రులారా అని పిలుస్తారు. కానీ, అనిల్‌ అంబానీ, మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీలాంటి వారిని మాత్రం సోదరులారా అని పిలుస్తారు’ అని రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu