
congress

నిర్మల్ జిల్లాలో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

మిర్యాలగూడలో జరిగిన నిరసన ప్రదర్శనలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు.

ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంతటా ఎద్దుల బండ్లు, సైకిళ్లతో ర్యాలీలు నిర్వహించింది. ఇందులో చేపట్టిన నిరసన ప్రదర్శనలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో అపశృతి చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్వల్పంగా గాయపడ్డారు.

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద పీసీసీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎడ్లబండితో నిరసన తెలిపారు.

ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసన ప్రదర్శనలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎడ్లబండి నడుపుతూ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.

జనగామ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎడ్లబండితో నిరసన తెలిపారు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎడ్లబండి నడుపుతూ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎడ్లబండి నడుపుతూ నిరసన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు.