ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై పోలీసు ఆత్మహత్య

ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన యువకులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగింది.

ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై పోలీసు ఆత్మహత్య
Follow us

|

Updated on: Sep 23, 2020 | 12:13 PM

ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన యువకులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగింది. అయితే తాజాగా తమిళనాడులో ఓ పోలీసే ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కి బానిసై, లక్షలలో డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ధర్మపురి జిల్లాకి చెందిన వెంకటేసన్ , సేలం జిల్లాలోని ప్రత్యేక పోలీస్ బెట్టాలియన్ లో విధులు నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా గంటల తరబడి ఆన్లైన్ రమ్మీ ఆడుతూ లక్షలలో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో అన్ని సమస్యలు అతడ్ని ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తీవ్ర మానసిక వేధనకు గురై  గవర్నమెంట్ హాస్టల్ లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read :

Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?

సీఎం జగన్ మరో విప్లవాత్మక పథకం, సెప్టెంబర్ 28న శ్రీకారం

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం !