దేశీయ యాప్‌లలో ‘విప్లవం’.. ‘ఆత్మనిర్భర్’ను లాంచ్ చేసిన మోదీ

ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లను రూపొందించేందుకు భారతదేశం నలుమూలల ఉన్న సాఫ్ట్‌వేర్ టెకీలు, స్టార్ట్-అప్ కమ్యూనిటీల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ను ప్రకటించారు.

దేశీయ యాప్‌లలో 'విప్లవం'.. 'ఆత్మనిర్భర్'ను లాంచ్ చేసిన మోదీ
Follow us

|

Updated on: Jul 04, 2020 | 7:05 PM

ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లను రూపొందించేందుకు భారతదేశం నలుమూలల ఉన్న సాఫ్ట్‌వేర్ టెకీలు, స్టార్ట్-అప్ కమ్యూనిటీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ను ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఆత్మనిర్భర్ యాప్ ఎకోసిస్టమ్’ను సృష్టించాల్సిన అవసరం ఎంతగానో ఉందని మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేశారు.

‘ఇవాళ మొత్తం దేశమంతా ఒక ‘ఆత్మనిర్భర్ భారత్’ను రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో వారి ప్రయత్నాలకు దిశానిర్దేశం చేయడానికి ఇది ఓ మంచి అవకాశం. వారి కృషిని ప్రోత్సహిస్తూ.. వారి ప్రతిభకు అనుగుణంగా ప్రపంచస్థాయి యాప్‌లతో సమానంగా ఈ విధమైన యాప్స్ రూపొందించేలా మార్గదర్శకత్వం చేయాలి’. అని మోదీ పేర్కొన్నారు.

అటల్ ఇన్నోవేషన్ మిషన్ – నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో ఈ చొరవను భారతీయులు ఇప్పటికే ఉపయోగిస్తున్న అప్లికేషన్లలో ఉత్తమ దేశీయ యాప్‌లను గుర్తించడంతో పాటుగా, ఆయా వర్గాలలో అవి ప్రపంచస్థాయి యాప్‌లుగా మారుతాయా అనే విషయాలలో వివిధ నగదు పురస్కారాలు, ప్రోత్సాహకాలు ఉండనున్నాయి. యాప్‌ల కేటగిరీల బట్టి ప్రైజ్ మనీ రూ .2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. వాడుకలో సౌలభ్యం,  భద్రతా లక్షణాలు, స్కేలబిలిటీ లాంటి చాలా విషయాలను పరిగనలోకి తీసుకుంటారు.

ఈ ఛాలెంజ్‌లో సుమారు ఎనిమిది కేటగిరీలకు చెందిన యాప్స్ పోటీపడవచ్చు. ఆఫీస్ ప్రొడక్టివిటీ & వర్క్ ఫ్రమ్ హోమ్, సోషల్ నెట్‌వర్కింగ్, ఇ-లెర్నింగ్, ఎంటర్టైన్మెంట్, హెల్త్ & వెల్నెస్, అగ్రిటెక్, ఫిన్‌టెక్‌తో సహా వ్యాపారం, వార్తలు, గేమ్స్. ఈ ఛాలెంజ్ గురించి పూర్తి వివరాలు “innovate.mygov.in” అనే వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 2020 జూలై 18వ తేదీ కాగా.. అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. MyGov పోర్టల్‌లో లాగిన్ కావాలి.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో