కేంద్ర మంత్రి తొందరపాటు… ఆడుకుంటున్న నెటిజన్లు!

Piyush Goyal Clarifies As
భారత ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత నెలకొంది. వృద్ది రేటు 6 శాతం దిగువకు చేరుకుందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. మరో వైపు దేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పప్పులో కాలేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ఓ వ్యాఖ్యలు నెటిజన్లకు ట్రోల్స్ చేసే అవకాశాన్నిచ్చాయి. గురువారం బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశానికి హాజరైన పీయూష్ గోయల్..ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిపై వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న వృద్ధి రేటుతో ‘5 ట్రిలియన్’ లక్ష్యం చేరుకోవడం సాధ్యమేనా అన్న ఓ విలేకరి ప్రశ్నకు ఆయన గణాంకాలను సీరియస్‌గా తీసుకోవద్దన్నారు.
“టీవీ ప్రోగ్రామ్‌లలో చూపిస్తున్న గణాంకాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాటి గురించి లోతుగా ఆలోచించాల్సిన పనిలేదు. ఐన్‌‌స్టీన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టడానికి గణితం కారణం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇది కాస్తా వైరల్ అవడంతో జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఐన్‌స్టీన్ ఏంటీ..గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టింది న్యూటన్ కదా అంటూ పగలబడి నవ్వుతున్నారు.
Piyush Goyal Clarifies As

12/09/2019,10:05PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *