Anti-Aging: 30 యేళ్లు నిండక ముందే వృద్ధాప్య ఛాయలు పెంచే అలవాట్లు.. వెంటనే మానుకోండి!

Updated on: Apr 08, 2024 | 9:39 PM

తెలిసో.. తెలియకో నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరబాట్ల వల్ల 30 ఏళ్లలోపే వృద్ధాప్య ఛాయలు కనిపించేలా చేస్తాయి. వయసు కంటే ముందే పలకించే వృద్ధాప్యాన్ని తేలికగా తీసుకోకండి. వయసు పెరిగే కొద్దీ ముఖంపై వృద్ధాప్య సంకేతాలు బలంగా మారుతాయి. చిన్న వయస్సులోనే చర్మం వృద్ధాప్యంలోకి అడుగు పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5
సన్‌స్క్రీన్ లేకుండా ఎండలోకి వెళ్లడం ప్రమాదకరం. UV కిరణాలు చర్మం వేగవంతంగా వృద్ధాప్యానికి కారణమవుతాయి. పిగ్మెంటేషన్, ముడతల సమస్యలను పెంచుతుంది. అందుకే ఎండలో ఉన్నా లేదా ఇంట్లోనే ఉన్నా, ఉదయాన్నే సన్‌స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోకూడదు.

3 / 5
ఒత్తిడి పెరిగినప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. ఒత్తిడి వల్ల చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే పొడి చర్మం అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది. నిర్జలీకరణ చర్మం ముడతలకు గురవుతుంది. అందుకే శీతాకాలం, వర్షాకాలం అయినా చర్మం తేమగా ఉంచుకునేలా చేసుకోవాలి. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, నిద్రలేమితో బాధపడటం, చర్మంపై ఒత్తిడికి కారణం అవుతుంది. సరైన నిద్ర లేకపోతే చర్మం పునరుద్ధరించబడదు. ఫలితంగా ముడతలు, నల్లటి వలయాలు పెరుగుతాయి.

4 / 5
మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు చర్మానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. ఈ చెడు అలవాట్లు చర్మంపై ఒత్తిడిని కలిగిస్తాయి. చర్మం పొడిబారుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

5 / 5
అధిక మొత్తంలో సౌందర్య సాధనాలను ఉపయోగించడం వల్ల చర్మ ఆరోగ్యం మరింత దిగజారుతుంది. ఓపెన్ పోర్స్, ర్యాష్ సమస్యను పెంచుతుంది. కొల్లాజెన్, సెబమ్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది వృద్ధాప్యానికి కారణమవుతుంది.