
మనం దేశంలో ఉదయం ఒక కప్పు టీ తాగకుండా ఆ రోజు మొదలవ్వదు. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచవ్యాప్తంగా కూడా జనాభా చాయ్ తాగుతారు. ఏ మాత్రం చిన్న అలసటగా అనిపించినా, మత్తుగా ఉన్నా, ఒక కప్పు టీ పడితే చాలు అది మీ మెదడు పై ప్రభావం చూపుతుంది. అయితే ఈ చాయ్, చాక్లెట్ లాగే మనకు రిలాక్స్‌గా చేస్తుందా? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఇప్పటికీ చాలా మంది మానసిక ఆరోగ్యానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనివల్ల కొందరిలో ఒత్తిడి పెరిగి అది డిప్రెషన్‌గా మారుతుంది. ఇలాగే వదిలేస్తే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. అంటే దాదాపు 1.2 బిలియన్ల మంది. వీరిలో ఆందోళన, డిప్రెషన్ సాధారణ సమస్యలు.

మీరు టీ లవర్స్ అయితే, ఒక అధ్యయనం ప్రకారం, చాయ్ మానసిక ఆరోగ్యానికి మంచిదని తెలిసి సంతోషిస్తారు. ఈ అధ్యయనాన్ని 491 మంది పెద్దలపై (169 మంది పురుషులు, 322 మంది మహిళలు) నిర్వహించారు. రోజుకు నాలుగు కప్పుల వరకు బ్లాక్ టీ తీసుకోవడం వల్ల 450 600 మిల్లీగ్రాముల కెఫిన్ ఉందని , ఇంకా ఇది డిప్రెషన్‌ను నివారించడంలో హెల్ప్ చేస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఈ అధ్యయనం ప్రకారం బ్లాక్ టీ మీ మానసిక ఆరోగ్యానికి మంచిదని చెబుతుంది. ఈ చాయ్‌లో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మన దేశంలో ఎంతో మంది చక్కెర, పాలతో చాయ్ తాగుతారు. దీనిని మరి ఎక్కువగా తాగడం వలన జీర్ణక్రియకు హాని కలగవచ్చు.. ఇంకా కేలరీల తీసుకోవడం కూడా ఇది పెరగవచ్చు.

బ్లాక్ టీతో పాటు గ్రీన్ టీ కూడా మీ మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీ తాగితే డిప్రెషన్ కొంత మేరకు తగ్గుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. ఇది ఆందోళన, డిప్రెషన్, సైకోటిక్ లక్షణాలను తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుందని అంటున్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, మీరు బ్లాక్ టీతో పాటు గ్రీన్ టీని తీసుకుంటే మంచిది.