Cold Shower in Winter: మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే..

|

Jan 09, 2025 | 3:24 PM

చాలా మందికి కాలమేదైనా చల్లటి నీటితో స్నానం చేయడం అలవాటు. దీంతో అన్ని కాలాల్లో గజగజ వణుకుతూనే చన్నీటి స్నానం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చలికాలంలో చన్నీటి స్నానం చేయడం ప్రాణానికి ప్రమాదకరం అంటున్నారు నిపుణులు..

1 / 5
చాలా మంది చలికాలంలోనూ చల్లటి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరానికి ఒక రకమైన తాజాదనం, ఉల్లాసం లభిస్తాయని చాలా మంది భావిస్తారు. అయితే మీకు తెలుసా? కొన్నిసార్లు ఈ రకమైన అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరం. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. అవును.. ఇది నిజం. కొన్ని పరిశోధనల ద్వారా ఈ విషయం రుజువైంది.

2 / 5
మెదడుకు రక్త ప్రసరణ మందగించినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు సాధారణంగా స్ట్రోక్ సంభవిస్తుంది. ఇలాంటప్పుడు మెదడులోని కొన్ని భాగాలకు ఆక్సిజన్ డెలివరీ ఆలస్యం అవుతుంది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైనది. సకాలంలో చికిత్స చేయకపోతే మరణానికి దారితీస్తుంది. దీన్ని సెరిబ్రల్ పాల్సీ అంటారు. కాబట్టి చల్లని నీరు సెరిబ్రల్ పాల్సీ ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
సీనియర్ వైద్యుడు డా. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. తలపై నేరుగా చల్లటి నీటిని పోయడం వల్ల సెరిబ్రల్ పాల్సీ ప్రమాదం పెరుగుతుంది. దీనికి కారణం నేరుగా తలపై చల్లటి నీటిని పోసుకున్నప్పుడు మెదడులోని నరాలు ఒక్కసారిగా కుంచించుకుపోవడం వల్ల రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో బలహీనత, అలసట, తలతిరగడం, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతాయి.

4 / 5
చల్లటి నీటితో స్నానం చేసేటప్పుడు చేతులు, కాళ్ళు, వీపు వంటి శరీరంలోని ఇతర భాగాలపై తొలుత నీటిని పోయాలి. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. ఆ తర్వాత తలకు నీళ్లను పోసుకోవచ్చు. ఈ విధంగా చల్లటి నీటితో స్నానం చేయవచ్చు.

5 / 5
మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం చన్నీటి స్నానం అంత మంచిది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉంటే చల్లటి నీటితో స్నానం చేయడం  ప్రమాదకరం. ఆరోగ్యానికి అనుగుణంగా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.