
సాధారణంగా ఈ విశ్వంలో ఉన్న చాలా వరకు జంతువులు కంటి చూపు ద్వారా విషయాలను గ్రహిస్తాయి. కానీ పాములు మాత్రం చూపుతో పాటు వాసనపై కూడా ఎక్కువగా దృష్టిపెడతాయి. పాము తమ నాలుకకు ఉండే కొన్ని ప్రత్యేక గ్రంధుల ద్వారా గాలిలోని రసాయనాలను సేకరించి.. నోటి పైభాగంలో ఉండే 'జాకోబ్సన్' అనే ప్రత్యేక అవయవం ద్వారా అవి వాసనను గుర్తిస్తాయి.

కాబట్టి పాముకు తన ఎదురుగా ఏ దృశ్యం కనిపించినా, దానికి సంబంధించిన వాసన రాకపోతే ఆ దృశ్యానికి సంబందించి సమాచారం దానికి అసంపూర్తిగానే ఉంటుంది. కాబట్టి పాము అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుప్పటికీ, దాని మెదడు మాత్రం ఆ ప్రతిబింబాన్ని తన రూపంగా అంగీకరించదు.

అద్దంలో వేరొక పాము కనిపిస్తున్నప్పటికీ దాని నుంచి ఎలాంటి వాసన రాకపోవడంతో ఆ వాసనను గ్రహించలేకపోతున్నాననే అయోమయంలో పాము తీవ్రమైన గందరగోళానికి, ఒత్తిడికి గురవుతుంది.ఈ క్రమంలోనే అది అద్దంలో కనిపించే పాముపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది.

అయితే సాధారణంగా జంతువుల తెలివితేటలను, వాటి సెల్ఫ్ అవెయిర్‌నెస్‌ను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కొన్ని సార్లు 'మిర్రర్ రిఫ్లెక్షన్ టెస్ట్‌లను చేస్తుంటారు. అయితే ఈ టెస్ట్‌ను పాములపై ఉపయోగించినప్పుడు.. రిజల్ట్స్ మిగతా జంతువుల కంటే బిన్నంగా వచ్చాయి. ఈ పరీక్షలో పాములు పూర్తిగా విఫలమవుతాయి. అందంలో కనిపించే దృశ్యం నుంచి వాసన రాకపోవడంతో ఆ ప్రతిబింబాన్ని తన శత్రువుగా భావించి, పాము కోపంతో పడగ విప్పడం, బుసలు కొట్టడం లేదా అద్దంపై దాడి చేయడం చేస్తాయి.

పాములకు కంటి చూపు ద్వారా తమను తాము గుర్తించే శక్తి లేకపోయినప్పటికీ, వాసన పసిగట్టే శక్తి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇవి తమ శరీరం నుండి విడుదలయ్యే ప్రత్యేక రసాయనాల వాసన ద్వారా తమ పరిధిని, ఉనికిని స్పష్టంగా గుర్తించగలవు. అ వాసనను గుర్తించడానికి పాములు తమ నాలుకను సెన్సార్‌గా వాడుతాయి. అందుకే తరచూ పాములు నాలుకను బయటకు తీస్తూ ఉంటాయి.