Hair Care: వర్షాకాలంలో మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 3 చిట్కాలు తప్పక పాటించాల్సిందే!

Updated on: Jul 08, 2026 | 7:45 AM

Monsoon hair care tips: వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా జుట్టు పొరక లాగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. దీనివల్ల మనం ఎంత స్టైలింగ్ చేసినా చూడ్డానికి అది వికారంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ జుట్టు లోపలికి చేరి, వాటిని ఉబ్బేలా చేస్తుంది. దీనివల్ల హెయిర్ క్యూటికల్స్ వాటి స్థానాన్ని కోల్పోయి జుట్టును మేనేజ్ చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి వర్షాకాలంలో హెయిర్‌ను ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

1 / 5
వర్షాకాలంలో జుట్టు మొత్తం పలచగా నిర్జీవంగా మారుతుంది. ఎంకంటే మన జుట్టుకు తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో గాల్లో హ్యుమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, జుట్టు బయటి తేమను గ్రహిస్తుంది. ముఖ్యంగా జుట్టు పొడిగా లేదా డ్యామేజ్ అయి ఉన్నప్పుడు, అది తేమ కోసం వాతావరణం వైపు చూస్తుంది. దీనివల్ల జుట్టు ఉబ్బిపోయి, పొడిగా, చెల్లాచెదురుగా కనిపిస్తుంది.

2 / 5
కాబట్టి వర్షాకాలంలో మీ జుట్టు పొడిబారకుండా ఉండాలంటే.. స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ చెమట, వర్షపు నీరు స్కాల్ప్ pH బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తాయి, దీనివల్ల జుట్టు బలహీనపడుతుంది. కాబట్టి ఎప్పుడూ సల్ఫేట్-ఫ్రీ షాంపూలను వాడేందుకు ట్రై చేయండి.

3 / 5
ఎందుకంటే నివేదికల ప్రకారం.. సల్ఫేట్-ఫ్రీ షాంపూలు జుట్టులోని సహజమైన నూనెలను తొలగించకుండానే వాటిని శుభ్రపరుస్తాయి. అలాగే స్నానం చేసిన తర్వాత కండిషనర్ వాడటం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది హెయిర్ క్యూటికల్స్‌ను సీల్ చేసి, తేమను లోపలే లాక్ చేయడానికి సహాయపడుతుంది. తద్వారా జుట్టు పొడిబారకుండా అడ్డుకుంటుంది.

4 / 5
చాలామంది స్నానం చేసిన వెంటనే జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దుతుంటారు. కాని ఇది పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల జుట్టు చిక్కుబడి, తెగిపోతుంది. కాబట్టి మైక్రోఫైబర్ టవల్ లేదా పాత మెత్తటి కాటన్ టీ-షర్ట్‌తో జుట్టును తేలికగా నొక్కుతూ నీటిని పిండేయాలి. అలాగే జుట్టుగా తడిగా ఉన్నప్పుడే దువ్వకండి. ఇలా చేస్తే జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది.

5 / 5
మీ జుట్టును తేమ నుంచి రక్షించుకోవాలంటే మీరు లైట్-వెయిట్ యాంటీ-ఫ్రిజ్ సీరమ్ లేదా లీవ్-ఇన్ కండిషనర్‌ను ఉపయోగించవచ్చు. ఇది జుట్టు చివర్లలో తేలికపాటి హెయిర్ ఆయిల్ లేదా సీరమ్ రాయడం వల్ల ఒక రక్షణ పొర ఏర్పడుతుంది. ఇది బయటి తేమ జుట్టులోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల మీ జుట్టు రోజంతా చిక్కులు పడకుండాగా ఉంటుంది.

Follow Us