గుడిలోకి వెళ్ళగానే గంట ఎందుకు మోగిస్తారు? ఆ దైవ రహస్యం ఏంటో తప్పక తెలుసుకోవాల్సిందే..!

Updated on: Apr 14, 2026 | 8:50 AM

గుడికి వెళ్లినప్పుడు ముందుగా గంట మోగించడం అనేది ఒక ఆచారంగా వస్తోంది. దీని వెనుక లోతైన అర్థం ఉందని మీకు తెలుసా..? పూజ ప్రారంభంలో లేదా హారతి ఇచ్చే సమయంలో గంట మోగించడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ధ్వని కేవలం వినసొంపుగా ఉండటమే కాదు, దీని వెనుక లోతైన శాస్త్రీయత దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. భక్తి వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ రహస్యం ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 6
హిందూ సంప్రదాయంలో గుడికి వెళ్లినప్పుడు గంట మోగించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు దాగివున్నాయి. గంటానాదం వినగానే మనస్సులో ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. అయితే, దీని వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, అద్భుతమైన విజ్ఞానం కూడా దాగి ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

2 / 6
పురాణాల ప్రకారం, గంటానాదం చేయడం వల్ల దైవ శక్తి మేల్కొంటుందని భక్తుల నమ్మకం. గంట మోగించడం అంటే భగవంతుడికి నమస్కరిస్తూ, మన ఉనికిని తెలియజేయడం. నేను నీ సన్నిధికి వచ్చాను, నా విన్నపాన్ని ఆలకించు అని దేవుడిని ప్రార్థించడానికి ఇది ఒక సంకేతం. గంటానాదం వల్ల కలిగే పవిత్ర ధ్వని దుష్ట శక్తులను పారద్రోలి, సాత్విక ప్రకంపనలను సృష్టిస్తుంది.

3 / 6
శాస్త్రీయ కోణం (Scientific Reason)లో చూస్తే..దేవాలయ గంటలను కాడ్మియం, సీసం, రాగి, జింక్, నికెల్, క్రోమియం, మాంగనీస్ వంటి లోహాల శాస్త్రీయ మిశ్రమంతో తయారు చేస్తారు. వీటిని ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలపడం వల్ల గంట మోగించినప్పుడు ఒక విలక్షణమైన ధ్వని వస్తుంది.

4 / 6
గంటను మోగించినప్పుడు వెలువడే ధ్వని ప్రతిధ్వని (Echo) సుమారు 7 సెకన్ల పాటు ఉంటుంది. ఈ ధ్వని తరంగాలు మన మెదడులోని ఎడమ, కుడి భాగాలను ఏకం చేస్తాయి. దీనివల్ల మన మెదడులోని ఏడు శక్తి కేంద్రాలు (చక్రాలు) ఉత్తేజితమై, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ శబ్దం మనస్సులోని అస్తవ్యస్తమైన ఆలోచనలను దూరం చేసి, భక్తుడిని ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది. దీనివల్ల దైవదర్శనం సమయంలో పూర్తి ఏకాగ్రత కుదురుతుంది.

5 / 6
అంతేకాదు..గంట మోగించినప్పుడు వచ్చే ప్రకంపనలు గాలిలోని సూక్ష్మక్రిములను, బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటాయి. తద్వారా పర్యావరణం శుభ్రపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. దేవాలయ గంట కేవలం ఒక లోహపు వస్తువు కాదు. అది మనస్సును, శరీరాన్ని దైవ ప్రార్థనకు సిద్ధం చేసే ఒక అద్భుత సాధనం. అందుకే పెద్దలు గుడిలోకి వెళ్ళగానే గంట మోగించాలని చెబుతారు.

6 / 6
గంటానాదం ప్రాముఖ్యత - శ్లోకం: "ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసామ్ | కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||" అంటే దైవ శక్తిని ఆహ్వానిస్తూ, అసుర శక్తులను వెనక్కి పంపుతూ చేసే ప్రక్రియే ఈ గంటానాదం.

Follow Us