
సాధారణంగా మన ఇంట్లో వాడే కుర్చీలైనా, స్టూల్స్ అయినా మనం ఒకదానిపై మరొకటి అమర్చి పెడుతుంటాం. అయితే వీటి మధ్య గాలి సరఫరా లేకుండా ఇవి అత్తుకుపోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల మళ్లీ వాటిని విడదీయడం ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు స్టూల్‌కు మధ్యలో రంద్రాన్ని ఏర్పాచేశారు. ఈ రంద్రం ద్వారా గాలి బయటకు వెళ్తోంది. తద్వారా స్టూల్స్ అత్తుకోక్కుండా ఈజీగా వస్తాయి.

అంతే కాదు ఈ రంద్రం చేయడానికి మరో రీజన్ కూడా ఉంది. నార్మల్‌గా ప్లాస్టిక్ స్టూల్స్‌లను ఇంజెక్షన్ మోల్డింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. ఇలా చేసే క్రమంలో ప్లాస్టిక్ త్వరగా చల్లబడి సంకోచిస్తుంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ పొరలు వంకర్లు తిరగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రంద్ర చేయడం ద్వారా ప్టాస్టిల్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా సమానంగా అది గట్టిపడుతుంది.

స్టూల్‌ను కడిగే సమయంలో కూడా ఈ రంద్రం బాగా ఉపయోగపడుతుంది. వీటిని కడిగేప్పుడు స్టూల్ మధ్యలో నీరు నిలవకుండా ఈ రంద్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. తద్వారా స్టూల్ త్వరగా ఆరుతుంది. అంతేకాదు ప్లాస్టిక్ స్టూల్స్ ఒకేసారి బల్క్‌గా తయారు చేస్తారు. ఇలా చేసేప్పుడు కొంచెం ప్లాస్టిక్‌ను తగ్గించినా, అది ఎక్కవగా ఉత్పత్తి చేసే టైంలో భారీ ముడిసరుకు, తయారీ ఖర్చును తగ్గిస్తుంది.

ఈ స్టూల్ మధ్యలో ఉండే రంధ్రం ఇతర కోణాల్లో కాకుండా గుండ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రంద్ర మరో ఆకారంలో ఉంటే ఒత్తిడి మొత్తం అదే ప్రాంతంలో పడుతుంది కాబట్టి పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అదే గుండ్రని అంచు ఉండడం వల్ల ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకుని ఎలాంటి పగుళ్లురాకుండా అడ్డుకుంటుంది.

మనం స్టూల్ పైన కూర్చున్నప్పుడు మొత్తం బరువు స్టూల్ మధ్యలోనే పడుతుంది. అయితే అక్కడ రంధ్రం లేకపోతే ఆ బరువతం కేంద్ర బిందువుపైనే పడి ప్లాస్టిత్ త్వరగా పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ మధ్యలో రంధ్రం ఉండటం వల్ల ఆ పీడనం సమానంగా చుట్టుపక్కల అంచులకు చేరి కాళ్లకు విస్తరిస్తుంది. దీని వల్ల చూల్ బలంగా నిలుస్తోంది.