
కొత్తిమీర ప్రతి వంటకాల్లో వేసుకుంటారు. దీనిని కూరల్లో వేసుకోవడం, దీనితో చట్నీ లాంటివి చేసుకోవడం వలన రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కొత్తిమీరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ కొత్తిమీరను వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

అయితే ప్రతి ఒక్కరూ కట్టలుగా కట్టి ఉన్న కొత్తిమీరను కొనుగోలు చేసి దానిని స్టోర్ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు కొత్తిమీరను కట్టలుగా కట్టి ఎందుకు అమ్ముతారో, దీనిని అలా అమ్మడానికి అనేక కారణాలు ఉన్నాయి అని చెబుతున్నారు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ముందుగా కొత్తిమీర చాలా త్వరగా వాడిపోయే స్వభావం కలిగి ఉంటుంది. అన్ని ఆకుకూరల్లో కొత్తిమీరనే చాలా త్వరగా చెడిపోతుంది. అయితే దీనిని వేరుతో సహా భూమి నుంచి తీసి, కట్టలుగా కట్టడం వలన ఎక్కువ రోజులు తాజా దనంతో ఉంటుందంట. వదులుగా, దేనికి దానికి విడిగా ఉంచడం వలన అది చాలా త్వరగా వాడిపోతుందంట. అందుకే దీనిని కట్టలుగా కట్టి అమ్ముతారు.

అంతే కాకుండా, కొత్తిమీరను కిలో లెక్క , అమ్మడం కంటే, ఒక కట్టకు ఇంతా అని అమ్మడం చాలా సులభం, అలాగే అది చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అందుకే దీనిని కట్టల మాదిరి అమ్ముతారంట. అలాగే దీనిని వేరుతో అమ్మడం వలన అది కూరల్లో వేసుకున్నా, మంచి పోషకాలు అందుతాయి, రుచి కూడా పాడవకుండా ఉంటుంది. అందుకే వేర్లతో తీసి, కట్టలుగా కట్టి కొత్తిమీరను అమ్ముతారంట.

ముఖ్యంగా చాలా వరకు కూరగాయల వాళ్లు అన్నిరకాల కూరగాయలు కొనుగోలు చేసి, ఒక మూటల్లా పట్టుకొస్తుంటారు. అయితే మార్కెట్ నుంచి ఇంటికి తీసుకొచ్చే సమయంలో, లేదా పండించిన భూమి నుంచి మార్కెట్‌కు తీసుకెళ్లే సమయంలో అది పాడవకుండా ఉండటానికి దానిని కట్టలుగా కట్టి, ఒక క్లాత్‌లో చుట్టి తీసుకెళ్తారంట.కట్టలుగా ఉండటం వలన కొత్తిమీరకు , ఇతర కూరగాయల నుంచి ఇబ్బంది ఉండదు, అది త్వరగా పాడవకుండా ఉంటుంది. ఒక వేళ కట్టలుగా లేకపోతే, అది చాలా త్వరగా పాడవుతుంది. అందుకే కొత్తిమీరను ఎప్పుడూ కూడా కట్టలుగా కట్టి మాత్రమే అమ్ముతారని చెబుతున్నారు నిపుణులు.