Mutton: వీళ్లకు మటన్ విషంతో సమానం.. అస్సలు తినకూడదు బాబోయ్.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

Updated on: Nov 02, 2026 | 9:11 PM

తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియుల జాబితాలో మటన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆదివారం వచ్చిందంటే చాలు చాలా ఇళ్లలో మటన్ కర్రీ లేదా బిర్యానీ ఉండాల్సిందే. శరీరానికి తక్షణ శక్తిని, ప్రొటీన్లను అందించడంలో మటన్ ముందుంటుంది. అయితే, రుచికరంగా ఉంటుందని అందరూ దీన్ని ఒకేలా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మటన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 5
గుండె జబ్బులు, హై కొలెస్ట్రాల్ ఉన్నవారు: మటన్‌లో సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు, హైపర్‌టెన్షన్ లేదా చెడు కొలెస్ట్రాల్ (LDL) సమస్యతో బాధపడేవారు మటన్ తింటే పరిస్థితి మరింత క్షీణించవచ్చు. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి, గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

2 / 5
 యూరిక్ యాసిడ్, కీళ్ల నొప్తులు: కీళ్ల నొప్తులు, గౌట్ సమస్య ఉన్నవారు మటన్‌ను పూర్తిగా నివారించాలి. మటన్‌లో ప్యూరిన్స్ అనే పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి. ఫలితంగా కీళ్లలో విపరీతమైన నొప్తులు, వాపులు వచ్చే అవకాశం ఉంది.

3 / 5
కిడ్నీ వ్యాధిగ్రస్తులు: కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. ముఖ్యంగా మటన్‌లో ఉండే హై ప్రొటీన్ కంటెంట్ కిడ్నీలపై అదనపు భారాన్ని మోపుతుంది. దీనివల్ల మలినాలను వడకట్టడంలో కిడ్నీలు ఇబ్బంది పడతాయి.

4 / 5
జీర్ణ సమస్యలు, ఊబకాయం: మటన్ జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారు లేదా తరచూ అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరంతో బాధపడేవారు మటన్‌ను జీర్ణించుకోవడం కష్టం. అలాగే బరువు తగ్గాలనుకునేవారు, ఊబకాయం సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

5 / 5
మటన్‌లో పోషకాలు ఉన్నప్పటికీ, కొందరికి అది విషంతో సమానం కావచ్చు. కాబట్టి, మీకు పైన పేర్కొన్న ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, మీ డైట్‌లో మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం ముఖ్యం అనే విషయాన్ని ఎప్పుడూ మరువకండి!

Loading...
Unable to load recommendations.
Follow Us