Kitchen Cleaning: స్టీల్, ప్లాస్టిక్, స్పాంజ్ ఏ గిన్నెకు ఏ స్క్రబ్బర్ వాడాలి?.. ఆరోగ్యానికి ఏది మంచిది!

Updated on: Jun 05, 2026 | 8:43 PM

మనం సాధారణంగా ఇంట్లో గిన్నెలు కడగడానికి స్టీల్, ప్లాస్టిక్, స్పాంజ్ వంటి స్క్రబ్బర్ వాడుతుంటారు. అయితే వీటిలో ఏది వాడితో మంచిదో మీరెప్పుడైనా ఆలోచించారా.. పొరపాటున తప్పుడు స్క్రబ్బర్ వాడకం వల్ల మనకు తెలియకుండానే గిన్నెల మెరుపు శాశ్వతంగా పోతుంది. ఎందుకంటే ఒక్కో గిన్నె తయారీ ఒక్కోలా ఉంటుంది, కాబట్టి వాటిని శుభ్రం చేయడానికి వేర్వేరు పీచులను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల శ్రమ తగ్గడమే కాకుండా గిన్నెలు కూడా ఎక్కువ కాలం కొత్తవాటిలా మెరుస్తాయి. కాబట్టి ఏ గిన్నెలకు ఏ స్క్రబ్బర్ వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
స్టీల్ స్క్రబ్బర్ : చాలా మంది ఇల్లల్లో అన్ని పాత్రలకు స్టీల్ స్క్రబ్బర్‌నే వాడుతూ ఉంటారు. కానీ ఇది కొన్నింటికి మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇది చాలా బలంగా ఉంటుంది. బాండీలు లేదా గిన్నెలకు పట్టిన మొండి మరకలను, మాడిపోయిన భాగాలను వదిలించడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇనుము , అల్యూమినియం గిన్నెలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీనిని ఎప్పుడూ నాన్-స్టిక్ పాన్లు, గాజు లేదా సిరామిక్ పాత్రలకు వాడకూడదు. ఎందుకంటే ఇది వాటిపై గీతలు పడేలా చేసి, వాటి కోటింగ్‌ను పాడు చేస్తుంది.

2 / 5
ప్లాస్టిక్ స్క్రబ్బర్:  ప్లాస్టిక్ లేదా నైలాన్‌తో చేసే ఈ స్క్రబ్బర్లను మనం ఇంట్లో తినేందుకు ఉపయోగించే గిన్నెల కోసం ఉపయోగించాలి. ఇది స్టీల్ అంత గరుకుగా ఉండదు కాబట్టి గిన్నెలపై గీతలు పడే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. దీనిని మీరు స్టీల్ గిన్నెలు, ప్లాస్టిక్ డబ్బాలు, గాజు గ్లాసులను కడగడానికి సులభంగా వాడొచ్చు. ఇది జిడ్డును వదిలించడమే కాకుండా గిన్నెల మెరుపును కాపాడుతుంది.

3 / 5
స్పాంజ్ స్క్రబ్బర్: మీ కిచెన్‌లో ఖరీదైన నాన్-స్టిక్ పాన్లు, టెఫ్లాన్ కోటింగ్ గిన్నెలు లేదా సున్నితమైన క్రాకరీ ఉంటే.. వాటి కోసం మీరు స్పాంజ్ స్క్రబ్బర్ వాడడం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే స్పాంజ్ చాలా సాఫ్ట్‌గా ఉండటం వల్ల గిన్నెల పైపొర పాడవకుండా ఉంటుంది. దీనికి ఒకవైపు కొద్దిగా గరుకుగా ఉండే భాగం తేలికపాటి మురికిని వదిలించడానికి, మరోవైపు మెత్తటి స్పాంజ్ గిన్నెలను సురక్షితంగా మెరిపించడానికి చాలా బాగా ఉపయోగపడుతాయి.

4 / 5
ఆరోగ్యానికి ఏది సేఫ్: మనకు కేవలం గిన్నెలు మెరిస్తే సరిపోదు.. దానితో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే స్పాంజ్, ప్లాస్టిక్ స్క్రబ్బర్లు ఎక్కువసేపు తడిగా ఉండటం వల్ల వీటిలో బ్యాక్టీరియా చాలా త్వరగా చేరుతుంది. కాబట్టి వీటిని వాడిన తర్వాత బాగా ఎండబెట్టాలి. అలాగే ప్రతి 2 నుండి 3 వారాలకు ఒకసారి వీటిని మార్చడం చాలా అవసరం.

5 / 5
అదే స్టీల్ స్క్రబ్బర్ అయితే త్వరగా ఆరిపోతుంది. దీనిలో బ్యాక్టీరియా కూడా ఎక్కవ నిలవదు. కానీ పాతబడే కొద్దీ దీని పదునైన తీగలు చేతులకు గుచ్చుకుని గాయాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పాతదైనప్పుడు దీనిని మార్చేసి కొత్తది కొనడం బెస్ట్. మీరు ఆరోగ్యాంగా ఉండాలనుకుంటే.. మీరు  స్టీల్ స్క్రబ్బర్ ఉత్తమంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Follow Us