మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిన్నారంటే ఎన్నో రోగాలు పరార్‌!

Updated on: Apr 05, 2026 | 8:19 PM

వెల్లుల్లిని దాదాపు అన్ని ఇళ్లల్లోని వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీనితోపాటు ప్రతిరోజూ ఉదయం ఒక వెల్లుల్లి రెబ్బ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి శరీరానికి బలాన్నిచ్చి, అనేక వ్యాధుల నుంచి రక్షించే ఎన్నో ముఖ్యమైన విటమిన్లు కలిగి ఉంటాయి..

1 / 5
వెల్లుల్లిని దాదాపు అన్ని ఇళ్లల్లోని వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీనితోపాటు ప్రతిరోజూ ఉదయం ఒక వెల్లుల్లి రెబ్బ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి శరీరానికి బలాన్నిచ్చి, అనేక వ్యాధుల నుంచి రక్షించే ఎన్నో ముఖ్యమైన విటమిన్లు కలిగి ఉంటాయి.

2 / 5
వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి సహాయపడుతుంది. వెల్లుల్లి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తుంది.

3 / 5
వెల్లుల్లిలో థయామిన్ అని పిలువబడే విటమిన్ బి 1 ఉంటుంది. వెల్లుల్లిలోని ఈ థయామిన్ శరీర జీవక్రియను నియంత్రించడంలో, ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది.

4 / 5
వెల్లుల్లిలో రైబోఫ్లేవిన్ అనే విటమిన్ బి-2 కూడా ఉంటుంది. ఈ విటమిన్ చర్మం, కళ్ళు, నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

5 / 5
వెల్లుల్లిలో నియాసిన్ అనే విటమిన్ బి-3 కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లిలో ఫోలేట్ అనే విటమిన్ బి-9 కూడా ఉంటుంది. ఇది రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Follow Us