
ఆహారంలో ఉల్లిపాయలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఉల్లిపాయల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కిచెన్‌లో ఏ వంట చేయాలన్నా ఉల్లిపాయలు తప్పక అవసరం అవుతాయి. పోపులో ఉల్లిపాయ లేకపోతే ఆ కూర రుచిగా ఉండదు. కానీ ఈ ఉల్లిపాయ ఉపయోగం కేవలం వంటల రుచిని పెంచడానికి మాత్రమే పరిమితం కాదు.

ఎండు ఉల్లిపాయని రోజూ గ్రాము చొప్పున తీసుకుంటే ఎముకల్లో ఖనిజ సాంద్రత పెరుగుతుంది. గొంతునొప్పి ఉంటే ఉల్లిపాయలో బెల్లం కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు నాలుగు టీస్పూన్ల ఉల్లిరసంలో చిటికెడు ఇంగువ, నల్లఉప్పు కలిపి రోజుకి రెండుమూడుసార్లు మూడునెలలపాటు తాగితే నులిపురుగుల బాధ ఉండదనీ చెబుతారు గృహవైద్య నిపుణులు.

తెల్ల ఉల్లిపాయ ముక్కల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే మూత్రంలో మంట తగ్గడంతోపాటు మూత్రపిండాలూ ఆరోగ్యంగా ఉంటాయి. కలరా వ్యాధితో బాధపడే రోగికి ఉల్లిరసాన్ని తరచూ పట్టిస్తే మంచిదట. పచ్చి ఉల్లిపాయని తింటే నెలసరి సమస్యలూ తగ్గుతాయి.

ఉల్లిపాయలో విటమిన్ సి ఉంటుంది. ఉల్లిపాయలో విటమిన్ బి6 కూడా ఉంటుంది. అందుకే ఆహారంలో ఉల్లిపాయలను తప్పక చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలో వివిధ రకాలు ఖనిజాలు కూడా ఉంటాయి. ఉల్లిలో యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్, పొటాషియం, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. అందుకే ఉల్లిపాయలను ఆహారంలో చాలా ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.

మీ ఆహారంలో ఉల్లిపాయలు ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లి రక్తపోటును అదుపులోనూ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఉల్లిపాయలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఉల్లిలో ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. కానీ ఉల్లిన ఎల్లప్పుడు ఆహారంలో మితంగానే తీసుకోవాలి.