అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..

|

Nov 24, 2024 | 8:14 AM

పోష‌కాల గ‌నిగా పేరొందిన అర‌టిపండును ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అన్ని కాలాల్లోనూ ల‌భించే అర‌టి పండు ఆక‌లిని తీర్చ‌డ‌మే కాదు శ‌రీరానికి అవ‌స‌ర‌మైన సూక్ష్మ పోషకాల‌నూ అందిస్తుంది. అలాంటిదే మరో ముఖ్యమైన, పోషకవిలువలు అధికంగా ఉండే పండు యాపిల్‌.. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదు అనే నానుడి అందరికీ తెలిసిందే. పండ్లను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అంది, ఆరోగ్యంగా ఉండగలం అనేది అందరికీ తెలిసిన ఆరోగ్య రహస్యం. అయితే అరటి పండు, యాపిల్‌ కలిపి తింటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించరా..?

1 / 5
రుచిలో ఎంతో మధురంగా ఉండే అరటిపండు విటమిన్లు, ఖనిజాల నిల్వ. ఇది చౌకైన పండ్లలో ఒకటి. అర‌టిలో ఫైబ‌ర్‌, ప్రొటీన్‌, ఆరోగ్య‌కర కొవ్వులు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉండ‌టంతో సంపూర్ణ ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన స‌మ‌తులాహారం ఈ పండు అందిస్తుంది. ఆపిల్‌లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి.

2 / 5
యాపిల్ పండులో ఉండే విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. క్యాన్సర్, మధుమేహం, గుండెకు సంబంధిత వ్యాధులు, అల్జీమర్స్‌ తదితర వ్యాధులతో పోరాడే శక్తిని యాపిల్ శరీరానికి అందిస్తుంది. రోజూ యాపిల్ తినడం వల్ల అందులోని పెక్టిన్ అనే సాల్యుబుల్ అనే ఫైబర్ పదార్థం చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

3 / 5
అరటి పండు రోగ శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఫలితంగా బీపీ అదుపులో ఉంటుంది. అరటి పండులోని విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్సర్ సమస్యలను సైతం అరటి పండు దూరం చేస్తుంది.

4 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శారీరకంగా శక్తి తక్కువగా ఉన్నవారు అరటి, యాపిల్ కలిపి తినాలి. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. అరటి, యాపిల్ కలిపి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీ జీర్ణశక్తి బలహీనంగా ఉంటే, ఆపిల్, అరటిపండు కలిపి తినడం ఉత్తమం.

5 / 5
యాపిల్, అరటిపండులో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. మరోవైపు, మీరు ఈ రెండు పండ్లను ఎక్కువ పరిమాణంలో తింటే, మీకు గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంది.