
గుండె ఆరోగ్యానికి మేలు: పుచ్చకాయ విత్తనాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచడానికి, గుండె పనితీరును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తాయి.

రోగనిరోధక శక్తి పెరుగుదల: ఈ విత్తనాలలో ఉండే జింక్ మన శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జింక్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కణాల పునరుత్పత్తికి, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

రక్తహీనత నివారణ: రక్తహీనత (అనీమియా) సమస్యతో బాధపడేవారికి పుచ్చకాయ విత్తనాలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. వీటిలోని ఐరన్ కంటెంట్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, శరీరమంతటా ఆక్సిజన్ సరఫరా వేగవంతమయ్యేలా చేస్తుంది. వీటిలో లభించే మెగ్నీషియం, బి-విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలో శక్తి ఉత్పత్తికి, జీవక్రియల వేగాన్ని పెంచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

పుచ్చకాయ విత్తనాలను ఆహారంలో ఎలా తీసుకోవాలి?: పుచ్చకాయ విత్తనాలను నేరుగా తినడం కంటే, వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి కొద్దిగా ఉప్పు లేదా మసాలా చల్లుకుని హెల్తీ స్నాక్‌లా తీసుకోవచ్చు. అంతేకాకుండా, వీటిని పొడి చేసి సూప్‌లు, సలాడ్లు, పెరుగు లేదా స్మూతీస్‌పై చల్లుకుని తింటే మంచి రుచితో పాటు పూర్తి పోషకాలు లభిస్తాయి.

వారానికి కొన్నిసార్లు పుచ్చకాయ విత్తనాలను పరిమిత పరిమాణంలో మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలను సులభంగా పొందవచ్చు. ఇకపై పుచ్చకాయ తినేటప్పుడు విత్తనాలను పారేయకుండా మీ ఆరోగ్యానికి ఉపయోగించుకోండి.