
పులిపిర్లు అనేవి చాలా సాధారణమైన చర్మ సమస్య. ఇవి గోధుమ రంగులో లేదా నల్లగా ఉండవచ్చు. చర్మంపై ఇన్ఫెక్షన్లు, వైరస్లు లేదా శరీరంలో విటమిన్ల లోపం వంటి కారణాల వల్ల పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్ల పరిమాణం పెరిగే కొద్దీ దురద, అసౌకర్యం, చికాకు వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఈ సమస్యను సమర్థవంతంగా, సురక్షితంగా .. సులభంగా ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. ఈ చిట్కా పులిపిర్లను ఎటువంటి మచ్చలు లేకుండా రాలిపోయేలా చేయడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇది షాపుల్లో ఈజీగా దొరుకుతుంది. ఇంకా చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. పులిపిర్లను త్వరగా రాలడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పులిపిరి చిన్నదైతే వెంటనే ఫలితం కనిపిస్తుంది. పెద్దదైతే కొద్దిగా సమయం పట్టవచ్చు, కానీ ఫలితం మాత్రం 100% ఉంటుంది.

ఇది పులిపిర్లను తొలగించడంలో సహాయపడటమే కాకుండా, అవి రాలిపోయిన తర్వాత ఎటువంటి మచ్చలు లేకుండా చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.ఇది ఈ మిశ్రమంలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన పదార్థం. పచ్చి బొప్పాయిని పైన గిల్లితే వచ్చే పాలు పులిపిర్లను త్వరగా రాలడానికి మరియు ఫలితాలను వేగవంతం చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇంట్లో సాధారణంగా వాడే పాలు కాకుండా, పచ్చి బొప్పాయి నుండి సేకరించిన పాలను మాత్రమే ఉపయోగించాలి.

ఒక చిన్న గిన్నెను తీసుకోండి. అందులో కొద్దిగా తడి సున్నం వేయండి. సున్నం ఎంత మోతాదులో కావాలో వీడియోలో చూపించిన విధంగా తీసుకోవచ్చు. సాధారణంగా నాలుగు నుండి పది పులిపిర్లకు సరిపడా సున్నం సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఒక చిటికెడు వంట సోడాను కలపండి. చివరగా, సుమారు అర టీస్పూన్ పచ్చి బొప్పాయి పాలను వేసి, ఈ మూడు పదార్థాలను బాగా కలపండి. ఇది ఒక పేస్ట్ లాంటి మిశ్రమంగా మారాలి.

తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని పులిపిరి ఎక్కడైతే ఉందో, దాని చుట్టూ జాగ్రత్తగా రాయాలి. పులిపిరి చర్మానికి అంటుకుని ఉన్న భాగాన్ని కూడా కవర్ చేయాలి. చుట్టుపక్కల ఆరోగ్యకరమైన చర్మానికి తగలకుండా చూసుకోండి. ఈ పేస్ట్‌ను రోజుకు ఒకటి నుండి మూడు సార్లు, మీ సమయాన్ని బట్టి అప్లై చేయవచ్చు. మిశ్రమాన్ని రాసిన తర్వాత కనీసం ఒక గంట పాటు అలానే ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.