
చాలా మంది కార్డియాలజిస్టులు ప్రతిరోజూ కొన్ని నిమిషాలు చురుకైన వాకింగ్ తప్పనిసరి చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాయామం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఇటీవలి పలు అధ్యయనాలు కూడా దీనిని నిర్ధారిస్తున్నాయి. అధ్యయనం ప్రకారం, వేగంగా నడవడం వల్ల అనేక గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

నెమ్మదిగా నడవడం కంటే వేగంగా నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బ్రిస్క్ వాకింగ్ శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేగంగా నడవడం వల్ల నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గి, రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది.

వేగంగా నడవడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇది మిమ్మల్ని మరింత సానుకూలంగా, సమతుల్యంగా ఉండేలా చూస్తుంది. ఈ వేగంతో నడవడం వల్ల మెదడులో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మీ ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది.

అంతేకాదు.. మాములు నడక కంటే కూడా వేగంగా నడవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని సైతం దూరంగా ఉంచొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేగంగా నడవటం వల్ల ఏరోబిక్ ఆక్టివిటీ పెరుగుతుంది. రోజూ 10 వేల అడుగులు నడవటం వల్ల గుండె సంబంధిత, అకాల మరణాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది. వేగంగా నడవటం వల్ల మెదడు పనితీరుపై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మూడ్ స్వింగ్స్, జ్ఞాపకశక్తి, నిద్రకు మేలు చేస్తుంది. వేగంగా నడిచే అలవాటుతో బీపీ, కొలెస్ట్రాల్ సైతం నియంత్రణలో ఉంటాయి. స్పీడ్ వాకింగ్ కండరాల బలాన్ని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది.