Adventure: ట్రెక్కింగ్, క్యాంపింగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీరు తప్పక సందర్శించాల్సిన ‘భూతల స్వర్గ’ ప్రాంతాలివే..

|

Apr 02, 2023 | 8:59 AM

హిమాలయాలలోని పర్వత శ్రేణులపై ట్రెక్కింగ్, క్యాంపింగ్‌కి వెళ్లాలనేది ఎంతో మంది ఔత్సాహికులకు ఉండే సర్వసాధారణమైన కోరిక. అటువంటి వారు అద్భుతమైన ట్రిప్ టూర్ వెళ్లేందుకు ఈశాన్య భారతంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి.

1 / 5
సాహసం అంటే ఇష్టపడే వారు పచ్చని పర్వతాలలోని గుహలను సందర్శించాలనుకుంటే.. క్యాంపింగ్, ట్రెక్కింగ్, రోమింగ్ కోసం ఉత్తర భారతదేశం వైపు తిరిగి చూడాల్సిందే. వాటిని సందర్శించడం అంటే స్వర్గంలో ప్రవేశించినట్లే అని చెప్పుకోవాలి.

2 / 5
ఆయా ఈశాన్య రాష్ట్రాలలోని ప్రదేశాలలో మీరు ట్రెక్కింగ్, క్యాంపింగ్ ప్లాన్ చేసుకోవచ్చు.సాహస పర్యాటకులకు ఈ ప్రదేశాలు ఉత్తమ ఎంపిక కూడా అని చెప్పుకోవాలి. మరి ఆ ప్రదేశాలేమిటో ఇప్పుడు చూద్దాం..

3 / 5
Mount Saramati, Nagaland: ఉత్తర భారతదేశంలో అనేక ట్రెక్కింగ్ ట్రాక్‌లు ఉన్నాయి. అటువంటి ట్రెక్కింగ్ ట్రాక్‌లలో మౌంట్ సారమతి కూడా ఒకటి. సారమతి నాగాలాండ్‌లోని ఎత్తైన పర్వతం.. దీనిని ఎక్కడం అంటే అది ఒక భిన్నమైన వినోదం. మీరు ట్రెక్కింగ్ ప్రియులైతే మీరు సారమతి పర్వతానికి వెళ్ళవచ్చు.

4 / 5
 Caves, Meghalaya: మేఘాల మధ్య ఉండే మేఘాలయ.. భూతలస్వర్గం కంటే తక్కువేం కాదు. పర్వతాలలోని అనేక గుహలు మేఘాలయాలోని మేఘాలతో కప్పబడి ఉన్నాయి. ఇక వాటిని చూడడం అంటే అది అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇక మేఘాలయాలో క్రెమ్ మవ్మ్లుహ్, క్రెమ్ డ్యామ్, క్రెమ్ లిమ్‌పుట్, మావ్స్మై గుహ, క్రేమ్ లియాట్ ప్రాహ్, క్రెమ్ లుబోన్, కొట్సాటి-ఉమ్లావాన్ కేవ్స్ వంటి అద్భుతమైన గుహ సముదాయాలు ఉన్నాయి.

5 / 5
Mishmi Hills, Arunachal Pradesh: మీ యాత్రలో ప్రకృతి, సాహసం రెండింటినీ అన్వేషించాలనుకుంటే, మీరు అరుణాచల్ ప్రదేశ్‌లోని మిష్మీ హీల్స్‌ను తప్పక సందర్శించాలి. వన్యప్రాణులతో కూడిన ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. మీరు ఈ ప్రదేశాన్ని ఒక్క సారి సందర్శించినా.. మళ్లీ మళ్లీ అక్కడికే వెళ్లాలని అనుకుంటారు.