
ప్రపంచంలో ఎంతోమంది.. ఎన్నో రకాల ఆహార పదార్ధాలను తీసుకుంటూ ఉంటారు. వాటిల్లో కొన్ని చూడటానికి, తినడానికి బాగుంటాయి. మరికొన్ని జుగుప్స కలిగిస్తాయి. ఇక అలాంటి ఆహారాల గురించి మాట్లాడుకుందాం.. వాటి గురించి తెలుసుకుంటే మీరు తినడానికి కూడా ధైర్యం చేయరు. అయితే ప్రపంచంలోనే పలు ప్రదేశాల్లో మాత్రం వీటిని భలే రుచిగా తింటారు.

ఈ వంటకం పేరు స్టింక్ హెడ్స్. దీనిని అలాస్కాలోని ప్రజలు రుచికరంగా తింటుంటారు. ఇది కింగ్ సాల్మన్ అనే చేప నుండి తయారవుతుంది.

సాధారణంగా, ప్రజలు కోబ్రా పాము పేరు వింటారు, కానీ వియత్నాంలోని ప్రజలు కోబ్రా హార్ట్‌ను కోసుకుని తింటారు. సర్వర్లు ఈ ఫుడ్‌ను కస్టమర్లకు ఎదురుగానే కోబ్రా పామును కట్ చేసి వడ్డిస్తారు.

సున్నక్జీ(Sunnacji).. ఇది కొరియన్ వంటకం, దీనిని ఎనిమిది కాళ్లు ఉన్న ఆక్టోపస్‌ను కత్తిరించి తినడానికి వడ్డిస్తారు.

జుమియల్స్(Jumiels)... ఇది ముఖ్యంగా మెక్సికోలోని ప్రజల ఫేవరెట్ డిష్. ఆరు కాళ్ళతో కూడిన పురుగులను వేయించి వడ్డించిన దాన్ని జుమియల్స్ అంటారు, ఇందులో ఉప్పు శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది.