
చేపలలో రారాజు పండుగొప్ప కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఏర్పడటంతో పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో రైతులు పండుగప్ప లను పెంచేందు ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో పండుగప్ప చేప సాగు తీర ప్రాంతంలో బాగా విస్తరిస్తోంది. రెండేళ్లుగా కరోనాతో సాగు అంతంతమాత్రంగా ఉండగా గత రెండు నెలలు నుంచి చేప ల ధరలు పెరగడంతో ఆక్వా రైతులు ఆసక్తి పండుగప్ప చేపల పెంపకం పై ఆసక్తి చూపుతున్నారు.

సముద్రం, ఉప్పు నీటిలో దొరికే ఈ చేప్పలను జిల్లాలోని మొగల్తూరు,నరసాపురం, భీమవరం,కాళ్ల మండలాల్లో సాగు చేస్తున్నారు.

ప్రస్తుతం సముద్రం,ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో సుమారు ఐదు వేల ఎకరాల్లో పండుగప్పను సాగుచేస్తున్నారు.మంచి ప్రోటీన్స్ ఉన్న పండుగప్ప చేపకు ను తినేందుకు నాన్ వెజ్ ప్రియులు ఎగబడతారు.

అంతర జాతీయ మార్కెట్ లో పండుగప్ప చేపల ధరలు ఆశాజనకంగా పెరగాయి.కిలో నుంచి రెండు కిలోలలోపు ఉన్న చేప 320,రెండు నుంచి ఐదు కిలోలలోపు ఉంటే 380, ఐదు నుంచి ఏడు కిలో లలోపు ఉంటే 420, ఏడు కిలోలు దాటితే డిమాండ్ మరింత బాగుంది.

పండుగప్ప బతుకున్న చేపలను మాత్రమే ఆహారంగా తీసుకోవడం దీని ప్రత్యేకత. దీంతో రైతులు చెరువుల్లో బెత్తులు,చైనా గొరకలు వంటి చిన్నపాటి చేపలను ఆహారం గా వేస్తున్నారు.

వీటిని పెంచేందుకు లోతు ఎక్కువగా ఉన్న ఎకరా చెరువులో 500 నుంచి 700 వరకు పిల్లలను వదులుతారు.

వీటిని చెరువులో ఏడాది పాటు పెంచితే పది కిలోల వరకు బరువు వచ్చే అవకాశం ఉంటుంది. ఎకరా రెండెకరాల్లో రొయ్యలు సాగు చేసే ఆక్వా రైతులు ప్రస్తుతం మూడు నుంచి నాలుగు ఎకరాల్లో పండుగప్పను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

పెట్టుబడులు పోను రాబడి బాగుంటుందని రైతులు తెలుపుతున్నారు.దీని ధర అంతరజాతీయ మార్కెట్ లో కిలో 480 చొప్పున ధర పలుకుతోంది.

జిల్లాలో పండిన చేపలను హౌరా,ముంబై,గోవా, కోల్ కతా, బిహార్ ప్రాంతాలతో పాటు విదేశాలకు పండుగప్ప ఎగుమతి అవుతున్నాయి. (Photo Story: Ravi Kumar, West Godavari, TV9 Telugu)