
ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతు తన పంటలను కాపాడుకోవడానికి సరి కొత్త ప్లాన్‌ను రూపొందించాడు. అతని ప్లాన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లఖింపూర్ ఖేరీలోని జహాన్ నగర్ గ్రామానికి చెందిన రైతు గజేంద్ర సింగ్ తన పొలంలో ఎలుగుబంటి వేషం వేసుకుని కూర్చున్నాడు.

గ్రామంలో రోజుకు 40-45 కోతులు పంటలను పాడు చేస్తున్నాయి. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని రైతు గజేంద్ర వాపోయారు.

కోతులు పంటలను దెబ్బతీయకుండా ఉండేందుకు రూ.4,000 వెచ్చించి ఈ దుస్తులను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఇప్పుడు ఎలుగుబంటి వేషంలో రైతు పొలంలో కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎక్కడికక్కడ వైరస్ వ్యాపిస్తుండటంతో మేల్కొన్న స్థానిక డీఎఫ్‌వో సంజయ్ బిస్వాల్ కోతుల బెడద పంటను దెబ్బతీయకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.