
పల్లెటూరు టమాటా చేతి పచ్చడికి కావలసిన పదార్థాలు: నాలుగు పండు టమాటాలు, 5 పచ్చిమిర్చి, రెండు చిన్న ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు , రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.

టమాటాలను ఇలా మగ్గించాలి: ముందుగా నాలుగు పండు టమాటాలు, పచ్చిమిర్చిని స్టవ్ మీద ఉంచి వాటిని పాన్లో వేసి వాటిని నూనెలో బాగా వేయించాలి. ఇంకా ఇవి . మెత్తగా ఉడికే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దీనికోసం 10 నుంచి 15 నిముషాల పాటు ఉంచుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా చేయాలి.

చేతితో వీటిని నలపి చేయాలి: ఇది వేడి తగ్గిన తర్వాత మీరు చేతితోనే టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిని బాగా నలిపి , ఆ తరవాత దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి చేతితోనే బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. రోలు , మిక్సీ వాడకుండానే మంచి రుచి వస్తుంది. కాబట్టి తప్పక ట్రై చేయండి.

వీటిని ఇలా కలుపుకోవాలి: చివర్లో వీటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అర కట్ట కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. మీకు ఇంకా మంచి రుచి కావాలంటే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇలా చేసి తింటే రుచి అదిరిపోతోంది. ఇలా ఈజీగా చేతితోనే మిక్స్ చేస్తే సరిపోతోంది.

వేసవికాలంలో ఎంతో మంది పనులు చేస్తూ చెట్టు కింద తింటుంటారు. అలాంటి సమయంలో ఈ పల్లెటూరు పచ్చడి తింటే ఆ క్రేజే వేరు. దీనికి రోలు, మిక్సీతో పని లేదు. దీనిని చేసుకుని ఆ తర్వాత చపాతీల్లోకి తింటే తింటే అబ్బా ఏం రుచి బాబోయ్ అంటూ లాగిస్తూనే ఉంటారు. మరి అంత రుచిగా ఉంటుంది.