
శుభ్రం చేసుకున్న చికెన్‌ను నీళ్లు లేకుండా తీసి, పైన పేర్కొన్న మ్యారినేషన్ పదార్థాలన్నింటినీ కలిపి, ఒక టేబుల్‌స్పూన్ నూనె వేసి బాగా పట్టించాలి. అరగంట నుండి గంట పాటు ఫ్రిజ్‌లో మ్యారినేట్ చేయాలి. ఎక్కువ సమయం మ్యారినేట్ చేస్తే చికెన్ మరింత టెండర్‌గా మారుతుంది.

రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, అనాస పువ్వులు, జాపత్రి, షాజీరా వేసి వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. తర్వాత జీడిపప్పు, టమాటా ముక్కలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి టమాటాలు మెత్తబడే వరకు మగ్గించాలి. చివరగా పుదీనా, కొత్తిమీర వేసి కలిపి, చల్లారిన తర్వాత నీళ్లు లేకుండా మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.

బిర్యానీ పాట్‌లో నాలుగు నుంచి ఐదు టేబుల్‌స్పూన్ల నూనె, రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ను వేసి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ పూర్తిగా ఉడికించాలి.

నూనె సెపరేట్ అవుతున్నప్పుడు, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి కలపాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్‌ను చికెన్‌కు కలిపి, మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఏ గ్లాస్‌తో బియ్యం కొలుచుకున్నామో, అదే గ్లాస్‌తో రెట్టింపు నీళ్లు (రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు) పోయాలి. చిట్టి ముత్యాల రైస్ లేదా బాస్మతి రైస్ అయితే కొద్దిగా నీటిని తగ్గించుకోవచ్చు. ఉప్పు సరిచేసి, ఎసరు మరిగే వరకు హై ఫ్లేమ్‌లో ఉంచాలి.

ఎసరు మరుగుతున్నప్పుడు, నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా వార్చి వేసి, ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి ఉడికించాలి. బియ్యం దగ్గర పడుతున్నప్పుడు, ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి కలిపి, మంటను తగ్గించి (లో ఫ్లేమ్) పూర్తిగా ఉడికేంత వరకు దమ్ చేయాలి. పులావ్ చక్కగా ఉడికి, నీరు లేకుండా తయారైన తర్వాత స్టవ్ ఆపేసి, మూత తీయకుండా పది నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత వేడి వేడిగా రైతాతో వడ్డించుకోవచ్చు.