
సాయంత్రం వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులను దానం చేయకూడదని పెద్దలు చెబుతున్నారు.వాటిలో ఇల్లు ఊడ్చుకునే చీపురు ఒకటి. వీటిని అస్సలు సాయంత్రం పూట అస్సలు ఎవరికి ఇవ్వకూడదు. ఇలా ఇస్తే లక్ష్మి దేవి కోప పడుతుందని చెబుతున్నారు.

అలాగే పాలు కూడా సాయంత్రం వేళ మీ ఇంటికి వచ్చి పాలను అడిగితే ఇవ్వకండి. ఇంకా పెరుగు, ఉప్పు కూడా ఎవరికీ దానం చెయ్యకండి. తెలుపు రంగు వస్తువులను ఎవరికి ఇవ్వకపోవడమే మంచిది.

ఆర్థిక లావాదేవీలు : మీ చుట్టాలకు సాయంత్రం పూట డబ్బు అస్సలు ఇవ్వకండి. మీరు అప్పుగా ఇవ్వొద్దు, అలాగే ఎవరి దగ్గర నుంచి అస్సలు తీసుకోకండి. ఇది వాస్తు నిపుణులు అశుభంగా చెబుతున్నారు.

తులసి మొక్కను రావి చెట్టును కూడా పవిత్రమైనదిగా చెబుతారు కానీ తులసి పక్కన నాటకూడదని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలోఉండే శక్తి ఇంట్లో కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి, ఈ మొక్కల పక్కన తులసిని అస్సలు ఉంచకూడదు. ఒక వేళ ఉంటే రోజూ ఉప్పు, పప్పుకు గొడవలు జరుగుతుంటాయి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.