
చాలా మందికి చీపురు, చెత్త బుట్ట ఎటు వైపు పెట్టాలో తెలియక ఇంట్లో ఇబ్బందులు పెడతారు. అయితే, ఇంట్లో చీపురు కట్ట స్థానం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అలాగే, చెత్త బుట్ట కూడా సరైన దిశలో ఉండాలని అంటున్నారు. మరి, ఏ దిశలో పెడితే అదృష్టం కలిసి వస్తుందో ఇక్కడ చూద్దాం..

ఈ రోజుల్లో చాలా మంది వాస్తును చాలా మంది నమ్ముతారు. ఇప్పటికి చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూసే ఇంటిని నిర్మిస్తుంటారు. అయితే, ఇంట్లో చెత్త బుట్ట, చీపురు కట్టను లక్ష్మి దేవి ప్రతీకలుగా చెబుతుంటారు. కాబట్టి, ఇవి మన ఇంట్లో చాలా ముఖ్యమైన వస్తువులు.

చీపురు కట్ట: ఇంట్లో దక్షిణ, తూర్పుదిశలో ఉంచాలి. ఇది అగ్ని మూలమని చెబుతారు. చీపురు కట్టను పెట్టడానికి ఇదే సరైన దిశ. ఇలా పెడితే లక్ష్మి దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దక్షిణ దిశ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ పోతోంది. ఉత్తర దిశలో అస్సలు పెట్టకండి.

చెత్త బుట్ట: వాస్తు ప్రకారం ఇంటి లోపల ఎడమ వైపు ఆగ్నేయంలో పెట్టడం చాలా మంచిది. అది కానీ పరిస్థితిలో దక్షిణ దిశలో పెడితే ధన వర్షం కురుస్తుంది. ఈశాన్యం ఇంటికి చాలా శుభప్రదమైన ప్రదేశం కాబట్టి ఈ దిశలో చెత్త వేయకండి అలాగే చెత్త బుట్టను పెట్టకండి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.