వాలెంటైన్స్ గిఫ్ట్ ఐడియాస్ : ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..

Updated on: Feb 07, 2026 | 8:17 PM

ప్రేమ.. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు వ్యక్తులు, రెండు మనస్సుల వారధి ప్రేమ. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇక ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వీక్ అంటే వాలైంటెన్స్ డే వీక్. ఫిబ్రవరి 7 నుంచి వాలెంటైన్స్ వీక్ మొదలవుతుంది. నేడు ఫిబ్రవరి7 రోజ్ డేతో ప్రేమికుల వీక్ స్టార్ట్ అయ్యింది. ఇక ప్రేమికుల రోజు అంటే, కేవలం పెళికాని జంటలది మాత్రమే కాదు, వివాహం అయిన వారు కూడా లవర్స్ డేను ఓ మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుంటారు.

1 / 5
ముఖ్యంగా ఈ రోజు తమ భాగస్వామికి అద్భుతమైన కానుకలు ఇచ్చి, ఆశ్చర్య పరుస్తారు. అయితే ఈ వాలెంటైన్స్‌ డేకు మీరు కూడా మీ భాగస్వామికి బహుమతులు ఇవ్వాలి అనుకుంటున్నారా? ముఖ్యంగా చేతికి అందాన్ని ఇచ్చే రింగ్స్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీ  మీ ప్రేమను తెలుపుతూ, మీ ప్రేమకు చిహ్నంగా ఉండే అద్భుతమైన రింగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
గోల్డెన్ హార్ట్ రింగ్స్ : 2026 వాలెంటైన్స్ డే మీ జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంలా మిగిలి పోవాలి అంటే, మీ ప్రేమ ఎప్పటికీ మీ భాగస్వామికి గుర్తు ఉండి పోవాలి అంటే, గోల్డెన్ హార్ట్ ఉన్న రింగ్ గిఫ్ట్ ఇవ్వడం బెస్ట్.  మీ హృదయాన్ని వారికి ఇచ్చినట్లు.. మీ గుండె నిండా తానే కొలువై ఉన్నట్లు ఈ రింగ్ అర్థం. అంతే కాకుండా దీనిని ప్రతి రోజూ ధరించినా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. కాబట్టి వాలెంటైన్స్ డే రోజు మీరు రింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్.

3 / 5
డబుల్ హార్ట్ రింగ్స్ : డబుల్ హార్ట్ రింగ్స్, ఇవి రెండు హృదయాల కలయికను సూచిస్తాయి. మనం ఇద్దరం, ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటాం అని చెప్పకనే చెబుతూ.. డబుల్ హార్ట్ రింగ్ గిఫ్ట్ ఇవ్వండి. ఇది మీలోని ప్రేమను నిజాయితీని సూచిస్తుంది. అంతే కాకుండా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని చూడగానే మీరు గుర్తు రావడం ఖాయం

4 / 5
నేమ్ రింగ్స్ : మీ నేమ్‌తో ఉన్న రింగ్‌ను గిఫ్ట్ ఇవ్వడం చాలా స్పెషల్‌గా ఉంటుంది. నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను అనే అర్థాన్ని ఇది సూచిస్తుంది. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. అంతే కాకుండా ప్రతి క్షణం మీరు తన గుండెల్లో నిలిచి పోతుంటారు.

5 / 5
ఇన్ఫినిటీ రింగ్స్ : మీ ప్రేమ అనంతం.. కొలవలేనిది అని చెప్పడానికి ఇన్ఫినిటీ రింగ్ తమ భాగస్వామికి ఇస్తుంటారు. వాలెంటైన్స్ డే రోజు ఈ రింగ్ గిఫ్ట్ ఇవ్వడం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. నా ప్రేమ అనంతం అంటూ మీ భాగస్వామికి ఈ రింగ్ తొడగడం వలన తాను చాలా సంతోషపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాలెంటైన్స్ డే రింగ్ గిప్ట్‌లో ఇది చాలా బెస్ట్.