
చాలా మంది అమ్మాయిలు ముఖం పై వచ్చిన ముడతలతో ఇబ్బంది పడతారు. ఇక కొందరైతే బయటకు రాలేక ఇంట్లోనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ ఇంటి చిట్కాతో ఈజీగా వదిలించుకోవచ్చు. మరి, ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సినవి ఏంటి? ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

చర్మంపై ముడతలు వస్తే అసలు కంగారు పడకండి. వాటి కోసం ఏవేవో ముందులు వాడి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. చిన్న వయస్సులోనే ఈ సమస్య వస్తే ఎంతో బాధగా ఉంటుంది. ఇంకా ఈ ముడతలు తగ్గించడం కోసం కాస్ట్ లీ లోషన్స్, ఇంకా క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటారు.

డబ్బు పెట్టకుండా మీ ఇంటి చిట్కాలతోనే సులభంగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ బిర్యానీ ఆకులు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ లో పట్టుకోవాలి. ఆ తర్వాత 5 యాలకులను వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక బిరియానీ, యాలకుల పొడి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.

ఇది చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ను వడకట్టి సీసాలో పెట్టుకోవాలి. ఈ ఆయిల్ 30 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి. ఈ నూనెను ముఖానికి, మెడకు రాసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలాగే 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు రోజు చేస్తూ ఉంటే ఇవి మొత్తం తగ్గిపోతాయి

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)