1kg చికెన్ తో 2kg గ్రేవీ! ఇది మ్యాజిక్ కాదు, ఈ టెక్నిక్.. కర్రీ ఎలా వండాలంటే?

Updated on: Sep 12, 2026 | 6:09 PM

చికెన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా చికెన్ కర్రీని తింటుంటారు. అయితే చికెన్ కర్రీ కంటే అందులో వచ్చే గ్రేవీ చాలా మందికి ఇష్టం ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం కేజీ చికెన్‌కు తీసుకొని రెండు కేజీల చికెన్ వండితే ఎంత గ్రేవీ అయితే వస్తుందో, అలా రావాలి అంటే ఎలా వండాలో చూసేద్దాం.

1 / 5
కేజీ చికెన్ ను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, చివరిసారి ఉప్పు, నిమ్మరసం వేసి కడిగితే నీచు వాసన లేకుండా ఉంటుంది. శుభ్రం చేసిన చికెన్ లో అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం (మీ రుచికి తగ్గట్టు), అర టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేయండి. పెరుగు అలర్జీ ఉన్నవారు నిమ్మరసం వాడుకోవచ్చు. ఈ మసాలాలన్నీ చికెన్ కు బాగా పట్టేలా కలిపి, ఒక గంటపాటు ఫ్రిజ్ లో మ్యారినేట్ చేయండి. ఫ్రీజర్‌లో పెడితే చికెన్ ముక్కలు మరింత మెత్తగా తయారవుతాయి.

2 / 5
ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టీ స్పూన్ గసగసాలు తీసుకుని, అవి మునిగేటట్టు నీళ్లు పోసి అరగంట నుండి గంటపాటు నానబెట్టాలి. మరో కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక, రెండు అంగుళాల అల్లం ముక్కలు, 10-15 వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజు టమాటా, ఒక చిన్న ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ, మూత పెడుతూ సాఫ్ట్‌గా మగ్గే వరకు వేయించాలి. మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిసేపు వేయించి, స్టవ్ ఆపి చల్లారనివ్వాలి.

3 / 5
నానబెట్టిన జీడిపప్పు మిశ్రమం, వేయించిన ఉల్లిపాయ-టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తటి పేస్ట్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక అంగుళం దాల్చిన చెక్క, రెండు యాలక్కాయలు, నాలుగైదు లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించండి.

4 / 5
ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను వేసి, నీళ్లు అస్సలు పోయకుండా, చికెన్ లోని నీటితోనే మధ్యస్థ మంటపై మూత పెట్టి పూర్తిగా ఉడికించండి. చికెన్ ముక్క మెత్తగా అయ్యి, గ్రేవీ దగ్గర పడి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ మొత్తాన్ని వేసి, నూనెలో బాగా వేయించాలి. పేస్ట్ ఎంత బాగా వేగితే కర్రీ అంత రుచిగా ఉంటుంది. కలుపుతూ, మూత పెడుతూ, మంటను మీడియం నుండి లో ఫ్లేమ్ లో ఉంచి, నూనె పైకి తేలే వరకు ఉడికించండి.

5 / 5
ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకుని, రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించండి. చివరిగా మీకు కావలసిన గ్రేవీ చిక్కదనాన్ని బట్టి అర కప్పు లేదా తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకుని, రెండు మూడు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయండి. సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేయండి. అంతే టేస్టీ టేస్టీ గేవ్రీ ఎక్కువగా ఉండే చికెన్ కర్రీ రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us