
ఉండ్రాళ్ళను ఇలా తయారు చేసుకోవాలి: ముందుగా ఒక పాత్ర తీసుకుని దానిలో బియ్యం పిండి వేసి అలాగే, గోరు వెచ్చని నీళ్ళు పోసి ముద్దలా కలపాలి ఆ తరవాత వీటిని చిన్న చిన్న ఉండ్రాళ్లుగా చేసుకోవాలి. కొద్దీ సేపటి తరవాత స్టీమ్‌లో 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి

పాయసాన్నిఈ విధంగా తయారు చేసుకోవాలి: ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. ఆ తరవాత ఈ మరిగిన పాలలో ముందుగా పక్కన పెట్టుకున్న ఉండ్రాళ్లు వీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఎంత ఎక్కువ సేపు పొయ్యి మీద ఉంచితే పాయసం అంత టేస్టీగా ఉంటుంది.

బెల్లాన్నిఈ విధంగా కలుపుకోవాలి: బెల్లాన్ని తీసుకుని నీటిలో బాగా మరిగించి వాటిని వడకట్టాలి. ఆ తరవాత ఈ బెల్లం పాకాన్ని తీసుకుని పాయసంలో బాగా కలుపుకోవాలి. పాలు కొద్దిగా చల్లారిన తర్వాత వేయాలి. ఇలా చేస్తే ఉండ్రాళ్ళతో కలిసిపోయి తినడానికి టేస్టీగా ఉంటుంది. చివర్లో యాలకల పొ డి, కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకోవాలి.

అలాగే, చివర్లో ఒక పాన్ తీసుకుని దానిలో నెయ్యి వేసి బాదం, కిస్మిస్ లు కూడా వేసి దీనిలో వేయించి పాయసంలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అయితే, దీనిని వేడిగా తింటే రుచి అదిరిపోతోంది. ఇంకా చల్లగా తాగితే బాడీ హీట్ తగ్గిస్తుంది. ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.

ఉండ్రాళ్ళ పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం పిండి, ఒక గ్లాస్ నీరు, రెండు కప్పుల పాలు, ఒక కప్పు బెల్లం తురుము, అర టేబుల్ స్పూన్ యాలకల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , 10 కిస్మిస్, 10 బాదంలు, ఒక కప్పు కొబ్బరి తురుమును తీసుకోవాలి. ఇవి వేస్తే పాయసం టేస్టీగా ఉంటుంది.