ఉగాది స్పెషల్.. తప్పక చేసుకోవాల్సిన నాలుగు రకాల వంటకాలు ఇవే!

Updated on: Mar 14, 2026 | 12:11 PM

ఉగాది పండుగ వచ్చేస్తుంది. మార్చి 19న తెలుగు ప్రజలు అందరూ ఉగాది పండుగను ఘనం జరుపుకుంటారు. ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఈ రోజు ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సిన వాటిలో ఒకటి. అయితే ఈ ఉగాది పండుగ రోజున తప్పకుండా నాలుగు రకాల వంటలు చేసుకోవాలి అంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
ఉగాది పచ్చడి : ఉగాది పండుగ వచ్చేస్తుంది. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు నూతన నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ రోజు షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి ప్రసాదంలా తీసుకోవడం  తప్పనిసరి, దీనిని బెల్లం చింతపండు, మామిడికాయ, కారం, ఉప్పు కలిపి తయారు చేస్తారు. ఆ ఆరు రుచులు అనేవి జీవితంలో వచ్చే కష్ట, సుఖాలకు, భయం, ఆనందం, దుఃఖం, కోపం వంటి వాటికి సూచిక అంటారు. అంతే కాకుండా ఈ పచ్చడి తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉగాది పండుగ వాతావరణ మార్పులను సూచిస్తుంది. అందువలన ఈ సమయంలో పచ్చడి తాగడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుందంట.

2 / 5
భక్ష్యాలు, పూర్ణం బూరెలు : భక్ష్యాలు, ఉగాది రోజు ప్రతి తెలుగింటి వారిలో తప్పకుండా  భక్ష్యాలు ఉంటాయి. శనగ పిండి, బెల్లం, మైదా పిండితో వీటిని తయారు చేస్తారు. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన ఉగాది రోజున తప్పకుండా ఈ భక్ష్యాలను చేసుకోవాలంట.

3 / 5
మామిడి కాయ పులిహోరా : మామిడికాయ పులిహోర చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ చింత పండు, నిమ్మకాయతో కాకుండా ఈ ఉగాదికి తప్పకుండా మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేయండి. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతే కాకుండా ఈ పులిహోర నైవేద్యంగా కూడా పెట్టవచ్చును.

4 / 5
బెల్లం పరమన్నం : ఉగాది పండుగ రోజు ఇంటిలో స్వీట్ తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఈరోజున బెల్లం పరమాన్నం వండుకోవడం వలన దీనిని నైవేద్యంగా పెట్టొచ్చు. దీనిని కప్పు పెసరపప్పు, బియ్యం, బెల్లం, పాలతో తయారు చేస్తారు. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

5 / 5
గారెలు : మినప గారెలు ఏ  పండుగలోనైనా తప్పకుండా ఉండాల్సిందే. మినపప్పు ప్రోటీన్‌కు గొప్ప మూలం. అయితే ఉగాది పండుగ రోజున మినప గారెలు చేసుకొని, కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అదిరి పోతుంది. అంతే కాకుండా, ఇంటిలోని వారు, పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు.

Follow Us