
పసుపు మన ఆరోగ్యానికే ఎంతో మేలు చేస్తుంది. పసుపులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే డాక్టర్లు కూడా దీనిని సిఫార్స్ చేస్తూ ఉంటారు. దీనిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ పసుపు మన చర్మ ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పసుపుతో పాటు కొన్ని పదార్థాలను ఉపయోగించి మీరు ఇంట్లోనే అందాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు. ఇందు కోసం మీరు పసుపుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలని చెబుతున్నారు. పసుపుతో ఫేస్‌ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

మీరు ఇంట్లోనే పసుపు ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి అనుకుంటే ముందుగా, ఒక గిన్నెలో ఒక టీస్పూన్ పసుపు పొడి తీసుకోండి. అదే గిన్నెలో రెండు టీస్పూన్ల శనగపిండి, కొద్దిగా పెరుగు కలపండి. రసాయనాలు లేని ఈ మూడు పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్‌లా చేయండి.

ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్‌ను మీ ముఖం, మెడ అంతటా పూర్తిగా అప్లై చేయండి. మీ చర్మం నిగారింపుగా మారేందుకు దాన్ని అలాగే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత పూర్తిగా కడిగేయండి. ఇలా మీరు వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే. మీ చర్మపై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోయి. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

కానీ ఈ ఫేస్ ప్యాక్‌ను మీ ముఖం అంతటికీ అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోవద్దు. Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.