
ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది.తులసి మొక్కలు వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. తులసి గుబురుగా, పచ్చగా ఉండాలంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే తులసి మొక్క బలంగా,గుబురుగా పెరగాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

ఎండ తగిలేలా చూసుకోవాలి : తులసి మొక్కకి కనీసం మూడు నుంచి ఎనిమిది గంటలు సూర్యరశ్మి అవసరం.అందువల్ల మొక్కను ఎండ వచ్చే ప్లేస్ లో ఉంచాలి.ఎండ తగలకుపోతే తులసి వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.కాబట్టి రోజుకు కనీసం ఆరు గంటలైనా ఎండ తగిలేలా చూసుకోవాలి.

చిగుళ్లను కత్తిరించాలి : మొక్క పైబాగంలో అంటే చిగుర్లు వచ్చే ప్లేస్ లో కత్తెరతో గాని, చాకుతో గాని చిగుళ్లను కత్తిరించినట్లయితే ఆ చిగుళ్ల దగ్గరనుంచి మరో నాలుగు ఏర్పడతాయి.మొక్క పొడుగ్గా పెరగకుండా పక్క కొమ్మలు గుబురుగా పెరుగుతాయి.ఇలా వారానికి ఒక్కసారైనా చిగుళ్లను కత్తిరించాలి.దానివల్ల మొక్క గుబురుగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మజ్జిగతో చిట్కా : ఒక గ్లాసులో మజ్జిగ తీసుకుని అందులో ఒక స్పూన్ పసుపు అర టిస్పూన్ ఇంగువ వేసి బాగా కలపాలి.ఆ మజ్జిగను తులసి మొక్క చుట్టూ పోయాలి. పసుపులో యాంటిబయోటిక్ గుణాలు ఉండడం వల్ల చీడపురుగులు రాకుండా ఆకులపై మచ్చలు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇలా వారానికి లేదా రెండువారాలకొకసారి చేస్తే సరిపోతుంది. తులసి మొక్క చుట్టూ ఉన్న మట్టిని చేత్తో గాని, మరేదైనా వస్తువుతో గాని కొంచెం గుల్లగా చేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ టీపోడిని, ఒక స్పూన్ పసుపును చుట్టూ చల్లడం వల్ల మొక్క బలంగా పెరగడమే కాకుండా చుట్టూ ఉన్న బ్యాక్టిరియాలు నశిస్తాయి.

మట్టిలో తేమను గమనించాలి : తులసి మొక్క తేమగా వున్నప్పుడు ఎక్కువ నీళ్లు పోయకూడదు.మట్టి అరిన తర్వాత మాత్రమే నీళ్లు పోయాలి.ఎక్కువ నీళ్లు పోయడం వల్ల మొక్క ఎండిపోవడం, వాడిపోవడం జరుగుతుంది.కాబట్టి మట్టి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నీళ్ళు పోయాలి. అంటే రెండు రోజులకొకసారి ఒకసారి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. పచ్చి పాలలో నీళ్లు కలిపి దానిలో కొంచెం పసుపు వేసి ఆ పాలను మొక్క చుట్టూ చల్లాలి. ఇలా చేయడం వల్ల చిగుర్లు బాగా మొక్క గుబురుగా పెరుగుతుంది.