
కావాల్సిన పదార్ధాలు : అర కిలో మటన్, ఒక కప్పు పచ్చి జీడిపప్పు, రెండు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, సరిపడా నూనె, రుచికి తగినంత నూనె ఉప్పు, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా మటన్‌ను తీసుకుని బాగా క్లీన్ చేసి, ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పుతోవాటిని కలిపి పక్కన పెట్టాలి. ఆ తర్వాత కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ చేసి అది వేడయ్యాక ఉల్లిపాయలు బాగా వేయించి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

ఇప్పుడు రెండు టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా వేయించాలి. ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఉప్పును వేసి బాగా కలపుకోవాలి.

మటన్ వేసి బాగా వేయించుకున్న తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసి 6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. కొద్దీ సేపటి తర్వాత జీడిపప్పును వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.

చివర్లో అర కట్ట కొత్తిమీరను తీసుకుని చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కూరను వేడి వేడిగా అన్నం, రొట్టెలతో తింటే రుచి అదిరిపోతోంది.