3 / 5
పాత రాతియుగం చేతిగొడ్డలిని అప్పటి ఆదిమానవులు క్రీ.పూ 50వేల నుంచి 12,500 సంవత్సరం వరకు వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే అరచేతిలో ఇమిడిపోయే ఈ పనిముట్టును కూడా ఓ నల్లసానపు బండతో తయారుచేసినట్లు వెల్లడించారు. చేతిగొడ్డలిగా అలాగే వేటాడిన జంతువు చర్మాన్ని ఒలిచే పరికరంగా వాడినట్లుగా అంచనావేస్తున్నామని చెప్పారు.