Telugu News Photo Gallery Top 10 players who can change the result of FIFA World Cup 2022 Final between Frame and Argentina
FIFA World Cup 2022 Final: అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆదివారం జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఫలితాన్ని మార్చేయగల టాప్ 10 ఆటగాళ్లు వీళ్లే..
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్లో లూసెయిస్ స్టేడియంలో అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాలు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజాల మధ్య పోరు జరగపోతుంది. ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చివేయగల సత్తా ఉన్న ఇరు జట్లలోని టాప్ 10 ప్లేయర్లపై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం..
అర్జెంటీనా జట్టుకు లియోనెల్ మెస్సీ గుండె ఇంకా వెన్నెముక అని చెప్పుకోవచ్చు. ఈ టోర్నీలో అతను ఇప్పటి వరకు ఐదు గోల్స్ చేశాడు. స్కోర్ చేసే అవకాశం ఉన్నప్పుడల్లా ఎందరో డిఫెండర్లను ఒకేసారి తప్పించగల శక్తి మెస్సీకి ఉంది.
టోర్నమెంట్ సాగుతోన్న కొద్దీ జూలియన్ అల్వారెజ్.. అర్జెంటీనా తరఫున మెరుగైన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రపంచకప్ టోర్నీలో అతను ఇప్పటివరకు నాలుగు గోల్స్ చేశాడు. వేగంగా పరిగెత్తడంలో ఈ ఆటగాడికి సాటి లేదు. క్రొయేషియాతో జరిగిన సెమీ ఫైనల్స్‌లో 3-0తో జట్టు విజయంలో జూలీయన్ కూడా ప్రముఖ పాత్ర పోషించాడు.
అర్జెంటీనాకు నాహుయెల్ మోలినా ఒక ఫుల్ బ్యాక్ ప్లేయర్ మాత్రమే కాక బలమైన డిఫెండర్. అట్లెటికో మాడ్రిడ్‌కు చెందిన మోలినా తన దూకుడు వైఖరితో మరింత ప్రసిద్ధిపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ స్ట్రైకర్లకు మోలినా పెద్ద సవాలుగా మారనున్నాడు.
ఎంజో ఫెర్నాండెజ్ టోర్నమెంట్‌ను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ప్రారంభించాడు. అయితే అర్జెంటీనా విజయంలో భాగంగా మెక్సికోపై అతను గోల్ చేయడంతో జట్టుకు ప్రధాన ఆటగాడిగా మారాడు. అతను అర్జెంటీనా మిడ్‌ఫీల్డ్‌లో కీలక ఆటగాడు.
ఎమిలియానోమార్టినెజ్ అర్జెంటీనా తరఫున పెనాల్టీ షూటౌట్లో కీలకపాత్ర పోషించగల గోల్ కీపర్. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు చేరుకుంటే మార్టినెజ్ పాత్ర కీలకం కానుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు.
అర్జెంటీనాకు ఫ్రాన్స్ ప్లేయర్ కైలియన్ ఎంబాప్పే అతిపెద్ద ముప్పు అని చెప్పుకోవాలి. తన వేగం, గోల్ స్కోరింగ్ నైపుణ్యంతో ప్రసిద్ధి చెందిన కైలియన్ ఈ టోర్నీలో మెస్సీతో సమానంగా ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఐదు గోల్స్ చేశాడు.
టోటెన్హామ్ తరఫున ఆడుతున్న హ్యూగో లోరిస్ రెండు ప్రపంచకప్‌లు గెలిచిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అతను ఎక్కువగా మాట్లాడకపోవచ్చు కానీ తన ఆటను బాగా ఆడతాడు. ఫ్రాన్స్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా లోరిస్ రికార్డు సృష్టించాడు.
29 ఏళ్ల రాఫెల్ వెరాన్ ఫ్రాన్స్ డిఫెన్స్‌లో బలమైన లింక్ ప్లేయర్. రాఫెల్ తన కెరీర్లో గాయాలతో ఇబ్బంది పడినా చాలా కీలక ప్లేయర్. రియాల్ మాడ్రిడ్ నాలుగు సార్లు ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలవడంలో అతనిది కీలక పాత్ర.
గత నాలుగేళ్లుగా పాల్ పోగ్బా స్థానంలో ఫ్రాన్స్‌లో మిడ్‌ఫీల్డ్‌లో ఆరేలియన్ చుమేనీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిడ్‌ఫీల్డ్‌లో అతనిని అధిగమించడం అర్జెంటీనాకు కష్టమవుతుంది.