
కిచెన్ గదిలో చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన గిన్నెలు మాడిపోతుంటాయి. అయితే, వాటిని వదిలించడం పెద్ద కష్టంగా ఉంటుంది. ఈ టిప్స్ తో ఎలాంటి మొండి జిడ్డునైనా ఈజీగా పోగొట్టవచ్చు.

కొందరు ఆడవాళ్లు ఎన్ని ప్రయోగాలు చేసిన కూడా అవి పోవు. అలా నల్లగా కనిపిస్తాయి. దీనిని ఎలా రుద్దలా అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే, సహజ టిప్స్ తో మాడిన గిన్నెలను తెల్లగా చేయొచ్చు.

మాడిన పాత్రలకు నిమ్మకాయ కరెక్ట్. వీటిలో ఉండే రసాయన సమ్మేళనాలు ఎంతటి మొండి జిడ్డు నైనా ఇట్టే తొలగిస్తుంది. ఇంకా చెప్పాలంటే, వీటిలో పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది.

నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా చేసి దానికి ఉప్పు అంటించి మాడిపోయిన పాత్రల మీద రుద్దాలి. ఇలా రెండు సార్లు చేయండి.

అలా రుద్దిన పాత్రలను కాసేపు పక్కన పెట్టండి. ఇక ఇప్పుడు వాటిని తీసుకుని వాటర్ ట్యాప్ కింద రుద్దుతూ వాష్ చేయండి. మాడిన జిడ్డు మొత్తం పోయి పాత్రలు మిల మిల మెరిసిపోతాయి.