నేటికీ ఈ దేశాలకు ఒక్క విమానాశ్రయం లేదు..! కారణం ఇదేనట.!!

|

Apr 11, 2024 | 10:51 AM

మనం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు ఖచ్చితంగా విమానాలనే ఆశ్రయించాల్సి ఉంటుంది. రోడ్డు, జల మార్గాల ద్వారా ప్రయాణించే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఆయా మార్గాల గుండా ఎక్కువ సమయం వృదా అవుతుంది. కాబట్టి విమాన ప్రయాణమే అందరికీ మొదటి ఎంపిక అవుతుంది. దీని కోసం ప్రతి దేశంలో విమానాశ్రయాలు కూడా నిర్మించబడ్డాయి. అయితే ప్రపంచంలో ఒక ఐదే దేశాల్లో ఇప్పటికీ విమానం గానీ, విమానాశ్రయం గానీ లేకుండా ఉన్నాయంటే నమ్మగలరా..? వినడానికి విచిత్రంగా ఉన్న విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కానీ, ఇది నిజం..ఆయా దేశాల్లో ఒక్క విమానాశ్రయం కూడా లేదు. ఆ 5 దేశాలు ఏవో తెలుసుకుందాం?

1 / 5
Andorra- అండోరా: ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్య ఉన్న ఈ దేశం చుట్టూ కొండలు ఉన్నాయి, దీని కారణంగా ఇక్కడ విమానంలో ప్రయాణించడం ప్రమాదకరం. అందుకే అండోరాలో విమానాశ్రయం లేదు.

2 / 5
Liechtenstein- లీచ్‌టెన్‌స్టెయిన్: లీచ్‌టెన్‌స్టెయిన్‌లో కూడా విమానాశ్రయ సౌకర్యం లేదు. ఇక్కడి నుంచి ప్రయాణం చేయడానికి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి వెళ్తారు.

3 / 5
Monaco- మొనాకో: ఫ్రాన్స్ మరియు ఇటలీ మధ్య ఉన్న ఈ దేశంలో విమానాశ్రయం లేదు. మొనాకో జనాభా మరియు ప్రాంతం రెండూ చిన్నవి, దీని కారణంగా ఇక్కడ విమానాశ్రయం లేదు.

4 / 5
Vatican City- వాటికన్ సిటీ: ఐరోపాలో ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ సిటీకి కూడా విమానాశ్రయం లేదు. ఈ దేశం మొత్తం వైశాల్యం 108.7 ఎకరాలు.

5 / 5
San Marino- శాన్ మారినో: ప్రపంచంలోని పురాతన దేశాల్లో ఒకటైన శాన్ మారినోలో ఒక్క విమానాశ్రయం కూడా లేదు. ఇక్కడి ప్రజలు రోడ్డు మార్గం ద్వారా ఇటలీలోని రిమిని విమానాశ్రయానికి వెళతారు.