
జూన్ 15వ తేదీన గురు, శని గ్రహాల కలయిక జరగబోతుంది. ఇది నాలుగు రాశులపై అనుకూల ప్రభావం చూపడమే కాకుండా, ఈ గ్రహాల కలయిక వలన క్రేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. ఇది పలు రాశులకు శుభ పలితాలను అందిస్తుంది. కాగా, అందులో మీ రాశి ఉందో చూడండి మరి!

వృషభ రాశి : శని,గురు గ్రహాల కలయిక వలన నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది మొండిబాకీలు వసూలు అవుతాయి. ధనలాభం ఉంది. అనుకోని ఆదాయ మార్గాల ద్వారా మీ వద్దకు డబ్బు చేరుతుంది.చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతుంటారు.

కుంభ రాశి : శని, గుర గ్రహాల కలయిక వలన కుంభరాశి వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ఇంటా బయట సానుకూల వాతావరనం ఏర్పడుతుంది. భార్యభర్తల మధ్య ప్రేమ మరింత బలపడుతుంది.విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఫస్ట్ క్లాస్ లో రావడం ఖాయం. అంతే కాకుండా నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి గురు, శని గ్రహాల కలయిక వలన అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఏ పని చేసినా అందువలో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అంతే కాకుండా ఈ రాశి వారు నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా సరదాగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కేంద్ర దృష్టి యోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా అనేక లాభాలు పొందుతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. చేతిలో డబ్బు ఉండటం మీకు చాలా ఆనందాన్ని ఇస్తూ.. రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు.