
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750జీ చిప్‌సెట్‌తో వచ్చే సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 23 5జీ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 6.6 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 50ఎంపీ+8ఎంపీ+2 ఎంపీ సెన్సార్లతో కూడిన ప్రైమరీ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ రూ.17,999 ధరతో అందుబాటులో ఉన్న వన్ ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఈఐఎస్‌తో 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్ లెన్స్,. 2 ఎంపీ మాక్రో లెన్స్ ఉన్నాయి. అలాగే 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆకర్షణీయంగా ఉంటుంది.

రెడ్‌మీ నోట్ 12 5 జీ ప్రారంభ ధర రూ.16,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 4 జీబీ +128 జీబీ , 6 జీబీ+ 12 జీబీ, 8 జీబీ + 256 జీబీ వేరియంట్లో ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరాతో 48 ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఐక్యూ జెడ్ 6 లైట్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ + 128జీబీ వేరియంట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.13,999గా ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా వస్తుంది.

మోటరోలా మోటో జీ 71 స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వచ్చే మోటో జీ 71 ఫోన్ ధర రూ.18,690గా ఉంది. ఈ ఫోన్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉంది. 6.4 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో పాటు వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది.