
దేవుళ్ల, దేవతల పేర్లకు అపారమైన శక్తి ఉంటుందంట.మీరు నమ్ముకునే ఏ దేవుడైనా సరే క్రమం తప్పకుండా జపించే వారు సకల పాపాల నుంచి విముక్తి పొందుతారంట. కానీ దేవుళ్ల టాటులు శరీరం పై వేయించుకోవడం వలన కొందరికి మంచి జరిగితే మరికొందరికి చెడు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.

అందువలన అస్సలే దేవుళ్ళు, దేవతల పేర్లు , దేవుళ్ల ఫొటోలు పచ్చబొట్లు వేసుకోకూడదంట. అలా వేసుకోవడం వలన పచ్చబొట్లు కూడా అపవిత్రంగా మారతాయి. ఇది దేవునికి అవమానం అవుతుంది, దీని కారణంగా మీరు ఆయన ఆశీర్వాదాలకు బదులుగా ఆయన కోపాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. అని చెబుతున్నాడు ప్రేమానంద్ మహారాజ్.

పచ్చ బొట్టు వేసుకున్న వ్యక్తి స్నానం చేసినప్పుడు, ఆ నీరు అదే పచ్చబొట్టు మీద నుండి అతని పాదాలలోకి ప్రవహిస్తుంది. ఇది ఆ పేరుకు అవమానం అవుతుంది అలాగే పచ్చబొట్టు వేయించుకున్న వ్యక్తి పాపం చేస్తాడు. అద కూడా అందులో భాగం అవుతది. ఇది కాకుండా, రోజంతా మనం అపవిత్రమైనవిగా భావించే కొన్ని విషయాల కూడా చాలానే ఉంటాయి.

మరీ ముఖ్యంగా దేవుళ్లు, దేవతల ఫొటోలు లేదా వారి పేర్లు శరీరంలోని ఏ భాగంపైన అయినా పచ్చబొట్టు వేయించుకోవడ అస్సలే మంచి కాదు అని చెబుతున్నాడు ప్రేమానంద మహారాజ్. అంతే కాకుండా అలా శరీరంపై దేవుని ఫొటోలు పచ్చబొట్టు వేయించుకోవడం వలన చాలా నష్టాలు కలుగుతాయంట. ఇలా చేయడం వలన మీరు పాపం చేసిన వారు కూడా అవుతారంటున్నారు స్వామిజీ.

పచ్చబొట్లు కాకుండా, మెహందీలో పొరపాటున దేవుడి చిత్రాన్ని వేయించుకోకూడదంట. అది కూడా పాపంలో భాగమవుతుందంట. కాబట్టి, దేవుళ్లు, దేవతల పేర్లు ఫొటోలను మెహందీలో ఎప్పుడూ వేసుకోకూడదంట. ఇలా చేయడం ద్వారా మీరు తెలిసి లేదా తెలియకుండా దేవుడిని అవమానిస్తున్నారని చెబుతున్నాడు ప్రేమానంద్ మహారాజ్.