స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేశారో మీ జుట్టు పని అయిపోయినట్లే.. ఒత్తైన జుట్టు కోసం..

Updated on: Mar 06, 2026 | 9:55 AM

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలడం అనేది అందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య. రకరకాల నూనెలు, ఖరీదైన హెయిర్ ప్యాక్‌లు వాడినా ఫలితం లేదని చాలామంది బాధపడుతుంటారు. అయితే అసలు సమస్య మనం వాడే ప్రొడక్ట్స్‌లో మాత్రమే కాదు.. స్నానం చేసేటప్పుడు మనం చేసే కొన్ని అలవాట్లలో కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జుట్టు కుదుళ్లను బలహీనపరిచే ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
షాంపూ నేరుగా తలపై వేస్తున్నారా: చాలామంది షాంపూని నేరుగా తల మధ్యలో వేసి రుద్దుతుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. షాంపూలోని కెమికల్స్ కుదుళ్లను నేరుగా దెబ్బతీస్తాయి. షాంపూని అరచేతిలో తీసుకుని కొంచెం నీటితో కలిపి అప్లై చేయాలి. అలాగే మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలను పదే పదే మార్చడం వల్ల జుట్టు నిర్జీవంగా మారుతుంది.

2 / 5
కండిషనర్ వాడకంలో జాగ్రత్త: కండిషనర్‌ను జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం వల్ల తల జిడ్డుగా మారి, జుట్టు రంధ్రాలు మూసుకుపోతాయి. కండిషనర్‌ను కేవలం జుట్టు పొడవునా మాత్రమే అప్లై చేయాలి. అలాగే షాంపూ చేసిన తర్వాత జుట్టును సరిగ్గా కడగకపోతే, మిగిలిపోయిన కెమికల్స్ వల్ల జుట్టు విరిగిపోయే ప్రమాదం ఉంది.

3 / 5
తడి జుట్టును దువ్వడం: స్నానం చేసిన వెంటనే జుట్టు కుదుళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ సమయంలో జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దడం వల్ల క్యూటికల్స్ దెబ్బతింటాయి. జుట్టును ఆరబెట్టడానికి సాఫ్ట్ కాటన్ క్లాత్ లేదా మైక్రోఫైబర్ టవల్ వాడండి. అలాగే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో దువ్వండి.

4 / 5
అతిగా తలస్నానం వద్దు: రోజూ లేదా తరచుగా తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజమైన నూనెలు పోయి డ్రైగా మారుతుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయడం ఉత్తమం. తేలికపాటి షాంపూలను ఎంచుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.

5 / 5
జుట్టు రాలడం తగ్గాలంటే కేవలం పైన పూసే నూనెలే కాదు.. స్నానం చేసే పద్ధతి కూడా మారాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది.

Follow Us