
పొడుపు కథలు వినగానే ఎలా అయినా ఆన్సర్ చెప్పేయాలని చాలా మంది అనుకుంటారు అయితే ఇది తెలిసినట్లే ఉంటుంది చాలా మంది పప్పులో కాలేస్తారు కానీ, ఇవే మెదడుకు పదును పెడతాయి. మీకోసం ఒక పొడుపు కథ రెడీగా ఉంది. మరి, అసలు లేట్ చేయకుండా ఇది ఏంటి? దీనికి మనం జవాబు చెప్పగలమా లేదా అనేది ఇక్కడ చూద్దాం..

మన చిన్నప్పుడు మన తాతయ్యలు అడిగే వాటిలో తెలుగు పొడుపుకథలు కూడా ఒకటి. ఇవి ప్రశ్న అడగక ముందు చాలా ఈజీగా చెప్పేస్తాం అనుకుంటారు కానీ అడిగిన తరవాత మన మైండ్ ను గజి బిజీ చేస్తుంది. చెప్పేస్తాం అనుకుంటాం కానీ అస్సలు చెప్పలేము. అలా అర్థం అయ్యి అర్ధం కానట్టు ఉంటాయి.

పొడుపు కథ: ఎక్కలేని చెట్టుకు కోట్లు కాయలు.. ఇదేంటో చెప్పగలరా? అసలు చెట్టే ఎక్కలేముగా మరి కోట్లు కాయలు ఎలా కాస్తాయి అని ఆలోచిస్తున్నారా? అసలు లాజిక్ ఇక్కడే ఉంది. మీరు మీ మైండ్ కు కొంచం పదును పెడితే ఈజీగా చెప్పేస్తారు. కాబట్టి కొంచం ఆలోచించండి.

మీరు ఆలోచించినా ఆన్సర్ దొరక్కపోతే కింద వివరంగా ఇస్తున్నాము. అది చదివి చక్కగా అర్ధం చేసుకోండి. ఒక్కసారి మీరు ఇది తెలుసుకున్న తరవాత ఇంత ఈజీనా ఇది అని పక్కాగా అనిపిస్తుంది. మీకు ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన తెలుగు పొడుపుకథలు కావాలంటే మేము పోస్ట్ చేసే వాటిని గమనిస్తూ ఉండండి.

ఈ పొడుపుకథకు కచ్చితమైన సమాధానం ఆకాశం, నక్షత్రాలు ఎక్కలేని చెట్టు: మనం ఎంత ట్రై చేసినా అందుకోలేని పెద్ద చెట్టు లాంటిది ఆకాశం. కోట్లు కాయలు అంటే ఆకాశంలో ఉండే కోట్లాది సంఖ్యలో ఉండే నక్షత్రాలు అని అర్థం