పండుగొస్తే తెలంగాణ ఇళ్లలో ఘుమఘుమలాడే నూనెలేని మాంసం కూర.. చేస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయ్

Updated on: Jul 13, 2026 | 6:30 AM

తెలిసిందే కదా తెలంగాణ పండుగల్లో ఇది తప్పక ఉండాల్సిందే. తెలంగాణ ఇళ్లలో ఘుమఘుమలాడే నూనెలేని మాంసం కూర ఇదే. దీనిని వండేటప్పుడే చేస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయ్. మరి అస్సలు లేట్ చేయకుండా దీనికి ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
నూనె లేకుండా మటన్ కూరకు కావాల్సిన పదార్థాలు: కేజీ మటన్ , మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక టమాటా, 10  పచ్చిమిర్చి, ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు, 10 కరివేపాకు ఆకులు, రెండు టేబుల్ స్పూన్ కారం,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, సరిపడా నీరును తీసుకోవాలి.

2 / 5
నూనె లేకుండా మటన్ కూర తయారి విధానం : ముందుగా మటన్ ను తీసుకుని  రెండు సార్లు బాగా కడిగి పక్కన   ఒక  చిన్న పాత్రలో పెట్టుకోవాలి. ఆ తర్వాత పెద్ద గిన్నె తీసుకుని  కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, 10 కరివేపాకు ఆకులు కూడా దీనిలో వేసి ఒక గ్లాసున్నర నీళ్ళు పోసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.  అలాగే, ఇంకా దీనిలో  ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్  కూడా మంచిగా కలిపి పక్కన పెట్టాలి

3 / 5
దీనిలో నూనె వేయము కాబట్టి దానిని తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే, దీనిలో  కట్ చేసిన టమాటాలు కూడా వేసి అవి కొద్దిగా  మెత్తబడే వరకు బాగా ఉడికించాలి. అలాగే, అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి,  రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మంచిగా కలపాలి. ఇంకా మసాలాలు వేసి అది ముక్కలకు   బాగా పట్టేలా 15 నిమిషాలు కలుపుతూ వీటిని బాగా ఉడికించాలి.

4 / 5
మటన్ నుంచి సహజ వచ్చే  సహజ నూనెతోనే ఇది ఉడుకుతుంది. ఇంకా దీనిలో వేసే టమాటా రసం, ఉల్లిపాయ రసాలతోనే కూర మంచి టేస్ట్ వస్తుంది. వీటితో పాటు అవసరమైతే  నీరు కూడా పోసి మూతపెట్టి మధ్య లో ఫ్లేవర్ మంటపై 10  నిమిషాలు పాటు వీటిని బాగా ఉడికించాలి. చివర్లో దీనిలో వేసే గరం మసాలా కూడా వేసి పొయ్యి మీదే ఉడికించాలి.

5 / 5
పరోటా, అన్నంలోకి సూపర్ : ఈ కూరను ఎక్కువగా తెలంగాణలో చేసుకుని తింటారు. కేవలం కూరగాయలతోనే చేస్తారు కాబట్టి సహజ రుచి వస్తుంది. దీని రుచి కూడా డబుల్ అవుతుంది. ఇంకా దీనిలో మీరు తినాలి అనుకుంటే 4 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు. ఇంకా ఒక్క చుక్క నూనె లేకపోయినా ఈ మటన్ కూర ఎంతో టేస్టీగా  ఉంటుంది.  మీరు ఈ కూరను వేడి వేడి అన్నం, పరోటాల్లోకి  తింటే  మంచిగా ఉంటుంది.

Follow Us