ఏముంటది మావా.. తెలంగాణ స్టైల్ జుట్టు కోడి కూర.. దావత్‌లకు ఇదే బెస్ట్ మరి!

Updated on: Apr 19, 2026 | 9:29 AM

సండే వచ్చిందంటే చాలు చాలా మంది చికెన్ తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే రెగ్యులర్‌గా తినే చికెన్, నాటు కోడి కాకుండా, నాటు కోడి కూర రుచిని ఇచ్చే ఈ జుట్టు కోడి కూర తింటే టేస్ట్ అదరిపోతుందంట. ఈ జుట్టు కోడిని లేయర్ కోడి అని కూడా అంటారు. ఇది అచ్చం నాటుకోడిలా రుచిని ఇస్తుంది. అంతే కాకుండా సరైన మసాలాలు వేసి వండితే టేస్ట్ అదిరిపోతుంది. కాగా, దీనిని తెలంగాణ స్టై్ల్‌లో ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
జుట్టుకోడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు : జుట్టు కోడి వన్ కేజీ, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాలు, సోంపు,లవంగాలు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, అనాస పువ్వు, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, గరం మసాలా.

2 / 5
తయారీ విధానం : ముందుగా జుట్టుకోడి ముక్కలను చిన్న సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని గోరు వెచ్చటి నీటిలో పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కడగాలి. తర్వాత ఈ ముక్కలకు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి దాదాపు 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు నాటు కోడి, జుట్టు కోడి కూరలోకి ఉపయోగించే స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలి. దాని కోసం ఎండు కొబ్బరి, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వీటన్నింటిని దోరగా వేయించి మసాలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్పెషల్ మసాలా రెడీ.

4 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో కర్రీకి కావాల్సినంత నూనె పోయాలి. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, పూదీన, కొంచెం కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, ఆనియన్స్, పచ్చి మిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.

5 / 5
ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. దాదాపు 20 నిమిషాలు దీనిని బాగా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. కొంచెం కొంచె వాటర్ పోస్తూ ఉడికించుకోవాలి. ఎందుకంటే దీని మాంసం చాలా గట్టిగా, మటన్‌లా ఉంటుంది. అందుకే చాలా సేపు ఉడకబెట్టుకోవాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత గరం మసాలా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పూ దీనా వేసి ఐదు నిమిషాలు ఉంచి, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్ జుట్టుకోడి కూర రెడీ, దావత్‌లకు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

Follow Us