
బెల్లం పాశానికి కావలసిన పదార్థాలు : ఒక కప్పు బియ్యం, ఒక కప్పు బెల్లం తురుము , రెండు కప్పుల పాలను తీసుకోవాలి, ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు, 10 కిస్మిస్ లు రెడీ చేసి పెట్టుకోవాలి. మీ ఈ పదార్థాలను విడి విడిగా తీసుకోవాలి మొత్తం ఒకే దానిలో పెట్టండి. ఇలా పెట్టుకుంటే ఫాస్ట్ గా కూడా రెడీ అయిపోతోంది.

బియ్యాన్ని ఈ విధంగా ఉడికించాలి : ముందుగా బియ్యాన్ని నీటితో బాగా కడిగి వాటిని బాగా ఉడికించాలి. అలా అని గట్టిగా కాకుండా మెత్తగా ఉండేలా వీటిని ఉడికించుకోవాలి. ఇలా చేస్తే పాశం మంచిగా వస్తుంది అలాగే, మంచి టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది తినడానికి బాగుంటుంది. మీరు ట్రై చేసేటప్పుడు దీనిని మర్చిపోకండి.

బెల్లం పాకాన్ని ఇలా రెడీ చేసుకోవాలి: ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక పెద్ద పాత్ర పెట్టి దానిలో రెండు గ్లాస్ ల నీళ్లు, బెల్లం వేసి వాటిని బాగా కరిగించాలి. అలాగే, బెల్లం మొత్తం కరిగిన తరవాత ఆ పాకాన్ని వేరు చేయాలి ఇలా చేస్తే దానిలో మలినాలు ఏమైనా ఉన్నా పోతాయి. ఇంకా ఇది పాశం టేస్ట్ ను కూడా పెంచుతుంది.

చివర్లో పాలను కూడా కలిపి బాగా మరిగించాలి: ఇప్పుడు ఉడికిన బియ్యంలో కొద్దిగా పాలు వేసి మీడియం మంటపై వీటిని బాగా మరిగించాలి. ఆ తరవాత పాలు బియ్యంలో కలిసి పోయే వరకు స్టవ్ మీదే వేయించాలి. ఇది పాశానికి మంచి టేస్ట్ ను ఇస్తుంది. ఇంకా సాఫ్ట్ గా ఉండేలా చేస్తుంది

బెల్లం పాకాన్ని కూడా ఇలా కలపాలి: ఇప్పుడు దీనిలో బెల్లం పాకాన్ని కూడా వేసి బియ్యం, పాలలో కలిసిపోయే వరకు ఉంచాలి. ఇలా వీటిని మెల్లిగా గరిటెతో కొద్దీ కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఇలా తిప్పితే పాశం గట్టిగా, టేస్టీగా మారుతుంది. దీనిని తింటే, ఒంట్లో వేడి క్షణాల్లో తగ్గిపోతోంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.